పుట:కాశీమజిలీకథలు -04.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నాకూఁతునకుఁ గనంబడిరఁట. అందలి సాంకేతిక మేమియో తెలియఁజేయవలయునని వేఁడుకొనియెను. అప్పు డయ్యోగి యించుక ధ్యానించి రాజా ! నీ సంతానము హరి యధికుండా ? శివుఁ డధికుఁడా? శక్తి యధికురాలా ? యను సందేహము గలిగి యా మువ్వురిలో జగత్కారణమైన వేల్పేదియో ! యని తీర్ధయాత్ర సేవించిరి గదా ? అందు దమ కేదియు నమ్మకము గనంబడినది కాదు. పిమ్మట నిందించిరి. వారి చిత్తములు యదార్థ నేత్తృత్వమందు నిశ్చయాయత్తములై యున్నవి. వారియందు భగవద నుగ్రహము గలిగినది. కావున నమ్మహాత్ముండు యదార్థమును జూపించెను. పరమాత్మతత్త్వ మొక్కటియే నిత్యమైనది. అది సుగుణ మనియు నిర్గుణ మనియు రెండు విధములు. హరిహరాది రూపకల్పనలు సగుణో పాసకులు సేయుచుందురు. తర్కింప నవియు యదార్ధములు కావు. మనుష్య లెట్లు కాలానుసరణముగాఁ బోవుచుందురో వారును బోవుదురని సూచించుటకై వాతాగ్ని ప్రకాహాదులు గనపఱచెను. కాల ప్రవాహంబునంబడి యెల్లరు గొట్టుకొని పోవుచు సుఖ దుఃఖముల నందుచుందురు అని తెలియుటకై నీ పుత్రులు తద్రూపమయిన సుఖదు:ఖముల నందిరి. ప్రపంచకము స్వప్న ప్రాయమని దీనం దెలియక మానదు. నీవు కడుపుణ్యాత్ముండవు ; నీ పుత్రులు కడు పవిత్రులు కృతకృత్యులైరని యాసంకేతము లన్నియుఁ దెలియఁ జేసెను. మాధవర్మ పుత్రులతోఁ గూడ నా వృత్తాంతమును విని పరమానందమును జెంది వారికిఁ గూడఁ దత్త్వోపదేశముఁ జేయుమని కోరికొనియెను. అప్పు డయ్యోగి, వారికెల్ల నద్వైతతత్వ మహత్వము నుపదేశించి కృతకృత్యుల గావించెను.

గోపా ! నీవు చూచిన పాషాణ పేటిక సుభద్రం గరుణించి యిచ్చిన బ్రహ్మరాక్షసుని భోజన పాత్రము. అల్ల నాఁడు శివవిష్ణు రాక్షసులు విసరిపాఱవైచిన నిచ్చట వచ్చిపడినది. నీ వెట్లయిన నన్ను విడువవని యా కథ యంతటితో ముగింపక సాంతముగా వక్కాణించితిని. ఇదియే దీని వృత్తాంతము అన యమ్మణిసిద్ధుండు శిష్యునితోఁ గూడిఁ దదనంతరావసధమునకుం జనియెను.

ముప్పది తొమ్మిదవ మజిలీథ.

ముప్పది తొమ్మిదవ మజిలీయందు గోపాలుండు వింతలంజూడ నరణ్యంబునకుం జని తిరుగుచు నొకచో రెండు బాఱల దంతమొకటి గనబడుటయు విస్మయముతో దాని వెండిదండము వోలె భుజమున నిడికొని తన యయ్యవారి యొద్దకువచ్చి నమస్కరింపుచు నా రదనం బతని కురంగట నిడి స్వామీ! ఇది దారువుగాదు, పాషాణము గాదు, లోహము గాదు. దీని స్వరూపముఁ జూడఁ బంటిపోలిక గనంబడు చున్నది. ఇట్టి పండ్లు ధరించిన జంతువు కళేబరమెంత యుండవలయును ? అది యే జంతువయి యుండును. దీని వృతాంతము విన వేఁడుక నాకు గాదు. మీకును సంతోషమే యైయుండక పోవదు. మీ మాణిక్యముచే దీనియుదంత మరసి వక్కాణింపుఁడని