పుట:కాశీమజిలీకథలు -04.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

కృష్ణుని కథ

119

తిని. తరువాత నతండు మెండువైభవముతో వివాహము గావించెను ? అదియు నబద్దమే యనియెదరా యన నతండు కానిమ్ము. ఇందొకటి నిజమున్నదాయేమి ? నీ కథాకల్పన విని మానందింతుముగా ? దావుడు నా యిందువదన పోనిండు. మీకెట్లు తోచిన నట్లు కావింపుఁడనియె. తరువాత నతండు సాధ్వీ ! యివియేనా మఱి యేమైనం గురుతులుగలవా ? యని యడిగిన నప్పడఁతి బూటకపుదాని మాటలేమి నమ్మకమగును. (సిగ్గభినయించుచు- ) - 1 ) | గ్రీడాంతరమున -

19 న ర ది" - ము ) ||ని అన్ని పంచి నన్నయ
4) ము: న్న "లకు) . • . , సమ్మతంబయో
. in * న న . గలలు. ఏ - మునితా
1... - DUచ పు • మజవహిం నగరు ... సఖి.

అని మెచ్చుకొనుచు నీ పద్యము చదువలేదా అన విని యతండు చెవులు మూసికొని శివశివా ! నా కేమియు జ్ఞాపకములేదు. నీ వెవ్వతెవో నే నెఱుంగను. బ్రహ్మలోక పర్యంతము విచారించి చూచితిని. నన్ను విడిచి నీ శీలము కాపాడుకొమ్మని పలికెను. అప్పు డా చిన్నది గోలుగోలున నేడ్చుచు రక్షింపుము, రక్షింపుమని యతని పాదములం బడినది. అతండు మెడకు బట్టఁజుట్టుకొని సాధ్వీ ! నీవు నాకుఁ దల్లివి కాని భార్యవుకావు వేయిఁజెప్పినను వినను. మీరు తెలియక మోసపోవుచున్నారు. ఏ పాపమైన భరింతునుగాని పరాంగనా సంగమ దురితంబు భరింపనోపనని రూఢిగాఁజెప్పి యప్పడఁతి పాదంబులం బడియెను.

అప్పు డా సువర్ణమాల చెలికత్తెలువచ్చి యామె నోదార్చుచు బోఁటీ ! నీ వేటికి విచారించెదవు. ఈయనకు మతిపోయి యట్లను చున్నాఁడు. చికిత్స చేయించవలయు నీ యందు దైవములేడా ? విడిచివేయుము. నెమ్మదిగా విచారించిన నతనికే తెలియఁగలదని పలుకుచుఁ గృష్ణు నా యాస్థానమునకుఁ దీసికొనిపోయి యితం డున్ముత్తవతార పీడితుఁడై యున్నవాఁడు. చికిత్స చేయించవలయునని రాజుగారికిఁ జెప్పి యొప్పగించిరి. ఆ రాజు మంత్రులతో నాలోచించి వైద్యుల రప్పించి యతనిం బరీక్షింపుఁడని చెప్పిన నా భిషక్కులు పరీక్షించి కొందఱు పైత్యవికారమనియుఁ గొందఱు పిశాచలక్షణమనియుఁ గొంద ఱున్మత్త వికారములనియుఁ దలయొకరీతిం జెప్పిరి. అప్పు డా రాజు కృష్ణుని బద్దుంజేసి యా యా చికిత్సలఁ జేయించు చుండెను.

బలభద్రుని కథ

గోపా ! యా కథ యట్లుండనిమ్ము. మధమంతమను నగరమున నాఁటి రాత్రి సత్రములో వారు నివసించియున్న సమయంబున --------- లాడికొనినమాటలు బలభద్రుఁడు ------స్వాంతుండై సోదరు --------- నా విద్యార్థుల వెంట