పుట:కాశీమజిలీకథలు -02.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగీతవృక్షము కథ

93

కాశీమజిలీ కథలు

రెండవ భాగము

15వ మజిలీ

సంగీతవృక్షముకథ

పదియేనవమజిలీ స్థలమునకు ముందరి గ్రామము మిక్కిలి దూరముగా నుండుటచే నయ్యతీంద్రుడు అందున్న సత్రమునందు బసజేసి వంట జేయుటకు ముందుగా స్నానముజేసి జపము చేసికొనుచున్న సమయంబున వింతలుజూచుటకై యాప్రాంతమునకు బోయిన శౌనకుడు వడిగా జనుదెంచి తానుజూచివచ్చిన విశేషమును దెలుపుటకై యాయన మౌనముద్రను విడగొట్టి యంజలిపట్టి యిట్లనియె.

స్వామీ! మీ జపమున కంతరాయము గలుగ జేసినందులకు క్షమింపుడు. నేను జూచిన విశేషము వినిన తరువాత మీరు నామీద గోపము చేయరు. మీరు జపము జేయుచున్న వారు గదా యూఱక యిచ్చట గూర్చుండనేల. నీప్రాంతవిశేషములు జూచి వచ్చెదంగాక అని నేను యిటునటు దిరుగచుండగా గనుచూపు మేరలో నొక దట్టమైన వృక్షముల గుంపు గనంబడినది. పర్వతము లాగున నొప్పుచున్న యత్తోట ఏపాటి మేటిదియో యని దాని దాపునకు బోయితిని. అందు బెక్కు వృక్షవిశేషములు గలవు. దేనినైన దినుటకు ఫలము లుండునేమోయని పరిశీలింపుచున్నంతలో నా చెవులకు నద్భుతమైన గానధ్వని యొకటి వినఁబడినది.

దానికి వెరగుపడుచు నలుమూలలు పరికించి యాపాటవీతెంచిన తెరవరయలేక విభ్రాంతి నొందితిని. అంతలో మరల నాగీతి వేఱొకరీతిని వినవచ్చినది. అచ్చట జనులెవ్వరును లేరు. ఇండ్లులేవు. ఇట్టిగానస్వాన మెచ్చటనుండి వచ్చినదో యని పెక్కుగతుల దలపోయుచు నొకవేళ దేవతలు విమానము లెక్కి గ్రుమ్మరునప్పుడు గానము పాడుకొనుచుండుట గలదు. కావున నదియేమో యని యాకాశమంతయు బరిశీలించితిని. ఎచ్చటను నెవ్వరిజాడయుం గనంబడలేదు. ఇదియునుంగాక మిక్కిలి దాపుగా నున్నట్లు వినంబడినది. అచెట్ల పైన నెవ్వరైన నుండిరేమోయని వాని కొమ్మల బరిశీలించి చూచితిని. కాని యందు నెవ్వరును లేరు. అంతలో మరల నొకవిధముగా వినబడినది. ఆహా? ఆ సంగీతము మనుష్యలోకసంబంధమైనది కాదని రూఢిగా జెప్ప