పుట:కాశీమజిలీకథలు -02.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

53

అప్పుడు కృష్ణదాసు భయపడుచు లోనికిబోవ బ్రయత్నించెను. రాజభటులు కదలనిచ్చిరికారు. తర్వాత రాజుగారు భటులతోగూడ నాలోనికిబోయి నలుమూలలు వెదకించిరి. అంతకు పూర్వమే యాయలజడివిని యర్చకులందరు తలయొకదారిని బారిపోయిరి. అందున్న యింద్రద్యుమ్ను డొక్కరుండు మాత్రము యూపంబుననున్న యజ్ఞపశువువలె స్తంభమున గట్టంబడి యొడలెరుంగక శక్తి కభిముఖముగా నిలువంబడి యుండెను. అట్టివానినిజూచి యారాజు శంకించుచు నీతండెవ్వడు? ఇట్లు గట్టబడియుండుటకు గారణమేమి? అని అడుగగా నొక్కరుండును మాటాడలేదు. పిమ్మట నతని మెడనున్న గొలుసుల విప్పించి నీ వెవ్వండవని యడిగెంచెను. ఆతడు గన్నులు దెరవకయే నేనిప్పుడు పరమాత్మను. వేగమశిరము నరుకుడని యుత్తరము చెప్పెను. ఆమాటలువిని యాపుడమిఱేడు పరితపించుచు నోహో! వీనిని బలియిచ్చుటకు నిచ్చట గట్టిరి. దాననే వీని నిట్లు పసుపుకుంకుమము మొదలగువస్తువులచే నలంకరించిరి అన్నన్నా! యొకనిమిషము దాటిన నిష్కారణము వీడు చచ్చిమేవునుగదా? కృష్ణదాసు నిటు రప్పింపుడని దూతలంబంపుటయు నదివరకే సగముచచ్చియున్న అతం డామాట విని వెరచుచు నెట్టకే యక్కడికి వచ్చెను.

ఆ రాజు కృష్ణదాసుని జూచి యోరీ! ఈతనినిట్లు స్తంభమునం గట్టించితివేమి? ఇతడెవ్వడు? నిజము చెప్పుము లేకున్న నిన్నిప్పుడు చిత్రవధ సేయంబత్తు ననుటయు నతండు గడగడ వడంకుచు మహారాజా! మేము వీనిని జంపుట కిందు గట్టలేదు. అమ్మవారి ప్రీతికై యిట్లు గట్టితిమి పిమ్మట విడిచివేయుదుము. ఇది మా కులచారమైయున్నది. ఈ విషయము మీదు పౌరుల నడిగి దెలిసికొనుడని నిర్భయముగా బొంకెను. ఆ రాజు వాని మాటలు విని కినియుచు ఓహో! మీ యాచార మంతయు వినియే యిచ్చటికి వచ్చితిని. మరల బౌరుల నడుగవలసిన యగత్యములేదు.

ఈ యూరివారెల్ల నిట్లే చేయుచుండిరి. కానిండు నేను మునుపటి రాజుగాను. వీని చేతనే యదార్ధమంతయుం జెప్పించెద జూడుమని పలుకుచు నింద్రద్యుమ్నునిం గట్టిన గొలుసులు విప్పించి వానిచే నా కృష్ణదాసుని గట్టించి యింద్రద్యుమ్నున కిట్లనియె. అయ్యా! మీ యాపద తొలగిపోయినది. నేనీ పట్టణపు రాజును. నా పేరు సింహకేతుడు. వీరి చర్యల విని పట్టుకొనుటకై యిచ్చటికి వచ్చితిని. మీరెవ్వరు? మీ పేరేమి? ఇట్లేల కట్టబడితిరి! మీవృత్తాంత మంతయుం జెప్పుడని యడిగెను. ఆ మాటలు విని యింద్రద్యుమ్నుడు. మనం బెట్టకే బాహ్యప్రచారమునకు జొనిపి మెల్లన గనులు దెరచి యెదురనున్న అతిని రేనిగా దెలిసికొని నమస్కరించుచు నిట్లనియె. అనఘా! నన్ను దేవలోకము నుండి మరల నీ లోకమునకు దెచ్చితివి. ప్రాణదానసుకృతము నీకు దక్కినది. మీవంటివారు పాలించుచుండ నీ గ్రామమున నిట్టి క్రూరకృత్యములు జరుగుట వింతగా నున్నది. ప్రజల యిడుమల నరయని రాజు నిరయమును బొందునని చెప్పుదురు. నా వృత్తాంతము వినుండు. నేనింద్ర