పుట:కాశీమజిలీకథలు -02.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

కాశీమజిలీకథలు - రెండవభాగము

నేననినమాటలు దలంచుకొంటిని. అందు శ్లేషయున్నది. అవియెరిగియనిన మాటలుకావు దైవము నానోటనుండి యట్లనిపించెను. ఇవి సురుచిగా నున్నవిగాని మర్మము తెలియ లేదంటిననగా సురుచియొక్క మర్మము నాకు దెలియలేదను ధ్వని సూచించుచున్నది. దాని కామె యుత్తరము చెప్పినది. మదనుగ్రహము సోకక నీసురుచిగు ట్టెట్లు తెలియును. అనుదానితో నాదయలేక యీవంటకములసంగతి నీకెట్లు తెలియుననియు నీ యందు మదనావేశము జెందినప్పుడుగాని నా గుట్టు తెలియ నీ కవసరము లేదనియు మనోహరమగుచేటికలు మనస్సును హరించు దూతికలనియు సుస్నేహరితము లనగా మంచి చమురువల్ల పుట్టినవని వంటకములకును అనురాగమున కివియే హేతువులని రెండవ యర్ధము స్ఫురించుచున్నది. నేను జెప్పినదానికి దగునుత్తరమిచ్చినది. ఇది మంచి చతుర. మాగురువు చతురుండైనను వృద్ధుడగుటచే నీమెకు సరిపడడు. వృద్ధునకు దరుణి విషమనుమాట సత్మము గదా. అని పెక్కుతెఱంగుల దలంచుచు దల వాల్చుకొని భోజనము చేసి పిమ్మట నేను విద్యామందిరమునకు బోయితిని.

విద్యార్థులందరునుగూడ పాఠములు చదువుకొనుమందిరమునకు విద్యామందిరమనిపేరు. అదియు వారింటిని జేరియే కొంచెమెడముగా నున్నది. అచ్చటికి బోయి నేను బాఠములు చదువ బూనుటయు నా మనం బందుజొర సురుచి యనిన మాటలు తలంచుకొనుచు నోహో! ఆమెయభిప్రాయ మేమియోకదా? చివర దిసినం భారముండదనికూడ యనినది. ఆ మాటలో ననుభవింపుమనియుం దోచు చున్నది. అట్టి మాట యనునా? ఇదివర కీమె గుణవంతురాలని ప్రఖ్యాతి యున్నదే. ఇప్పుడుమాత్ర మావ్రతమేల చెరుపుకొనుచు, విద్యావతిగనుక చమత్కృతికయి యట్లనెనని తోచుచున్నది. వేరొకయభిప్రాయము నిక్కముగా గలిగినచో నీ లోపున నిచ్చటి కెద్దియో మిషబన్ని రాకమానదు. అది నిజమైన నేనీయాపద నెట్లు దాటుదును. దైవవశమున నీరాత్రి మాగురువుగారు వచ్చిన లెస్సయగుంగదా! అని పరిపరిగతుల దలంచుచు సంశయాకులచిత్తుండనై తల్లడిల్లుచుంటిని. ఇంతలో సాయంతన సమయమగుచుండ నా యండజగమన నా దండకు వచ్చి మదనా! యీ రాత్రి నీకిష్టమైన శాకమెద్దియా చెప్పుము. వండెదనని యడిగినది. అప్పుడు నేను దద్దరిల్లి యేమియుందోచక నీకిష్టమైన శాకము వండుమని చెప్పితిని. ఆ మాట విని యాజవ్వని నవ్వుచు మదనా! నా యిష్టమైనది నీకిష్టమేనా యని ముమ్మారు పలికినది. దానికి నేనౌను నీకిష్టమగు కూర నాకునిష్టమే యని చెప్పితిని. అప్పుడప్పాటలగంధి మదనా! యీ మాట మరువకుము. పిమ్మట నీకిష్టము లేదన్నను దప్పదుసుమీ యని పలికి తిరిగి జూచుచు లోపలికి బోయినది.

అప్పుడు నామనంబునగల యనుమానము తీరినది. ఆ చిన్నది యెన్నడును మా విద్యామందిరమునకు వచ్చినదికాదు. నా యిష్టము నీ యిష్టమా యని యూరక ముమ్మారు తర్కింపనవసరమేమి? తిరిగి చూచుచుబోయినది. ఈ చిహ్నము