పుట:కాశీమజిలీకథలు -02.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదృష్టదీపుని కథ

177

ఆదారింబడి పోవబోవ గొన్నిదినముల కొకపట్టణము గనంబడినది. అది విదర్బదేశపు రాజధానియయిన భర్మాపురము. దాని ననంతవర్మయనురాజు పాలించు చున్నవాడు. అవ్వీటిలో విదేశస్థులకు నివసింపదగినది యదృష్టదీపుండుంచిన సత్రమే. కావున నతండును బౌరులవలన నదియున్న చోటు దెలిసికొని యా మిత్రునితో గూడ నచ్చటికి బోయెసు. అశ్వారూఢుడై యతండట్లు వెళ్ళినతోడనే యచ్చటి సత్రాధికారులు వాడుక ప్రకారము నెదురుగా బోయి యర్ఘ్యపాద్యాదులచే నర్చించి యల్లునికి జేయునట్లుగా సుపచారములచేయ దొడంగిరి. ఆ రీతినంతయు మొదట సత్ర ముంచునపుడు అదృష్టదీపు డేర్పరచినదే. అతండట్టి పద్ధతులతో వ్రాసిన పత్రికల యందొకచోట గట్టంబడి యున్నవి. దానింజదువుకొనుచు నతడు మిక్కిలి సంతోషించుచుండెను. తాను జూచుచుండగనే యనేకులాసత్రములోనికి వచ్చిరి. సతాధిపతులు వారినెల్ల నట్టి మర్యాదలతోనే తోడి తెచ్చిరి. సత్రములో సతతము నదృష్టదీప మహారాజు పేరు మ్రోగుచునే యుండును. అతనిపేరు పద్యములచేత గీతములచేత రచించి యనేకులా గోడలమీద వ్రాసిరి మరికొందరు విగ్రహములు వ్రాసి క్రింద నదృష్టదీపుడని విలాసముల వైచిరి. ఈరీతి నందెచ్చట జూచినను తనపేరే వ్యాపించి యున్నది. ఆ సత్రములో గుటుంబములతో వచ్చియున్న బ్రాహ్మణులందరు సంభాషించుకొనుచుండి నిట్లు విననయ్యె.

రామశాస్త్రి - వెంకటశాస్త్రిగారూ! తమరిచ్చటికి వచ్చి యెన్ని దినములయినది. యింకనుగొన్ని నాళ్ళుందురా?

వెంకటశాస్త్రి - రామశాస్త్రిగారా! తమ రెచ్చటనుండి వచ్చుచున్నారు. నేను గుటుంబముతో వచ్చి యారు మాసములైనది. మరికొన్ని దినములుండెదను. ఆయదృష్టదీపమహారాజు సత్రము వేసెను గదా ! యెంతకాలముండినను నేలోపములేదు. ఇంటికన్న గుడి పదిల మనునట్లు మనయిండ్లలో నేమియున్నది. ఆహా! ఆ మహారాజు యెచ్చటనుండెనో కాని ఎంత పుణ్యాత్ముడండి! ఆయనయుంచిన సత్రములన్నియు నీతీరుననే యున్నవి. ఎన్నిదినములుండినను బొమ్మను మాటలేదు.

రామ - ఆయన సత్రములు మీరేమి చూచిరి. నేను జూచిన వానిలో నిది యెంత. నేనాయనను జూడవలయునని యెన్ని యో దేశములు తిరిగితినికాని యెచ్చటను కనంబడలేదు. ఎచ్చటజూచినను ఆయన ప్రఖ్యాతిమాత్ర మొక చోటకంటె మరియొకచోట నెక్కుడుగా నున్నది. నేను సమస్త శాస్త్రములు జదివితిని నన్ను జూచినంత నాయన సంతోషించుచు జక్రవర్తిగా జేయడా? ఆయన యీవికి మేరలేదు. మనము వినియున్న కర్ణదధీచిశిబివిక్రమార్కాదులను మించిపోయినాడు. మొన్న రామేశ్వరములో నమ్మహానుభావుడు చేయించిన దానములకు నెంతసొమ్ము వ్యయమైనదో