పుట:కాశీమజిలీకథలు -02.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

కాశీమజిలీకథలు - రెండవభాగము

రాకుండునట్లెద్దియేని యాలోచింపుము. నీవు బుద్ధిమంతుఁడవు. వెనుకటి కోపముంచు కొనకుమని పలికిన నతఁడు విచారించుచు అయ్యో! నే నిప్పుడేమి సేయువాఁడ సేనలెచ్చట నున్నవియో తెలియదు. ఈ లోపలవాండ్రు బైటికి వచ్చిరేని నిలువలేము. కర్తవ్యమేమియని యాలోచించుచు నచ్చటఁ గొందరిని గావలియుంచి యప్పుడే పురమంతయుఁ జాటింపించెను.

ఆ చాటింపువలన సిద్ధముగా యున్న సైన్యమువచ్చి కోటముంగిటనిలచెను. దానిలోఁ గొంతసేనను దుర్వినీతు నింటిచుట్టును నిలిపెను. తరువాత దేశములోనున్న వాహినికి వార్తలనంపెను ఇంతలో నాచోళదేశ ప్రభువగు వసురక్షితుఁడు ఆవార్తవిని మితిలేని సేనలం గూర్చుకొని యా యూరుముట్టడించి భేరీవాయించెను. ఆ ధ్వనివినినతోడనే రాజు గుండియలు భేదిల్లినవి. కోటతలుపులు మూయించిరి. బురుజులమీఁదను గోడలమీఁదను ఆయుధములతో యోధుల నిలిపిరి ఈరీతి నోపినంతవరకు వ్యూహము పన్నించి విజయకేతుఁడు రాజునొద్దకుఁ బోయి నమస్కరించి యిట్లనియె.

దేవా! వసుమిత్రుడు చతురంగబలములతో వచ్చి పట్టణము ముట్టడించినాడు. వారిసేనలో మనసేన నాలుగవవంతైనను లేదు కోటనిలుచుట గష్టముగా నున్నది. యోపినంతవరకుఁ బోరుదము. కాని కోటలోనున్న ప్రచ్ఛన్నమార్గము తలుపులు తీయింపుడని చెప్పగా రాజుమిగుల శోకాక్రాంతుడగుచు నట్టియేర్పాటు చేయించెను. అప్పుడది చూచి యంతఃపురకాంతలెల్ల గొల్లుమని యేడ్వసాగిరి అప్పటికి రాజునకు మూడేండ్ల ప్రాయముగల యొకకుమారుఁడుండెను. మరియు నతని పట్టమహిషి తొమ్మిదినెలల గర్భముతో నున్నది. అట్టి సమయములో నెట్టియవస్థ వచ్చెనోచూడుము. వారిట్లు సవరించుకొనుచున్న సమయములో రణభేరీధ్వనులు సమీపముగా వినిపింప దొడంగినవి.

అప్పుడు శత్రుసైన్యము గ్రామములోఁ బ్రవేశించి కోటముట్టడించినట్లు తెలియవచ్చినది. దానికి మిక్కిలి భయపడచు రాజును మంత్రియుఁ నాయుధంబులు ధరించి బురుజులపైనెక్కి శత్రుసైన్యము నంతయు జూచి యధైర్యపడియు నంతలో ధైర్యము తెచ్చుకొని పగతుర కోటదరికిఁ జేరకుండునట్టు కొంతసే పాయుధములఁ బ్రయోగించిరి. దానంజేసి వారి గోట దాపునకుఁజేరుట గష్టమైనది. గుట్టంతయుఁ దెలిసిన దుర్వినీతుఁడు కోటదుర్గముల నెరిగియుండుటం జేసి వారిరువురు లేచి రెండవ పెడకు సేనలం దీసికొనిపోయి కోటపై తుపాకులఁ గాల్పించెను.

ఆ చప్పుడులకు వెఱచి కోటలోనున్న స్త్రీలు తల్లడమందఁజొచ్చిరి. రాజును మంత్రుయు నోపినకొలది దుపాకులఁగాల్చుచుండిరి. కాని సముద్రమువలె నావరించి యున్న సేన నంతము నొందింప లేకపోయిరి. అప్పుడు శత్రుసైన్యము హద్దుమీరి