పుట:కాశీమజిలీకథలు -02.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

155

బోయి యందు మా అత్తవారియింటియొద్ద గొన్ని దినంబులుంటిని. అంత నొక్కనాడుదయంబునలేచి చూచువరకు దేవదూతలు నన్ను బట్టుకొని తీసికొనిపోవుచుండిరి. మీరెవ్వరు నన్నెచ్చటికి దీసికొనిపోవు చుంటిరని అడుగగా మేము దేవదూతలమనియు నింద్రునియానతి స్వర్గమునకు దీసికొని వెళ్ళు చున్నారమనియుం జెప్పి క్రమంబున నన్నిచ్చటికి దీసికొని వచ్చిరి.

ఇదియే నా వృత్తాంతము నేను వెనుకజూచిన సభ యిదియే. నా పూర్వపుణ్యమువలన రెండవసారి జూచుట లభించినది. అప్పుడు దేవరవారి దర్శనము కాలేదు. అంతకన్న విశేష మిప్పుడు గలిగినది. నేను గృతార్థుడ న న్నెల్లకాల మిచ్చట నుండులాగున అనుగ్రహింపుడని అనేకవిధముల బ్రార్థించితిని. నామాటలన్నియు విని ఇంద్రుడు వెఱగుపడుచు బృహస్పతి మొగము జూచి గురువర్యా! వీరి చరిత్రమును వింటివా? మిగుల విచిత్రముగా నున్నదే? ఇది అంతయు నిక్కమే యగునా? పరిశీలించి వక్కాణింపుడనుటయు నాయాచార్యుండు నవ్వుచు దేవేంద్రా! వీడెంతవాడు కాకున్న రెండుసార్లు స్వర్గమున కెట్లు వచ్చును. జగన్నాథస్వామికి వీని తండ్రి భక్తుడగును. వీని పూర్వపుణ్యము మంచిది. ఈ యుత్తరము వీనిదే. ఇచ్చట మరచిపోయిన వాడు కాబోలు. వీనినిక భూలోకమున కనుపుమని పలికెను.

అప్పుడు దేవేంద్రుడు గురుని మాట మన్నించి యోహో! హరిదయాపాత్రుడైన వీనికి మనము సత్కారములు సేయవలయును. లేకున్న నాయనకు గోపము వచ్చుచు తన భక్తుల నవమానపరుచుటకు యతడు సహింపడు. అతం డలిగెనేని మన యైశ్వర్యమంతయు దృటిలో నశించును. పాపము తిలోత్తమపై నిష్కారణము నింద మోపితిమి ఆసతి చెప్పిన దంతయును సత్యమే. నందుని దూషింపరాదు. కావున నిప్పటి కెవ్వరు నపరాధులు కారు అని పలుకుచు నా మొగముపై దృష్టి బరగించి యిట్లనియె.

రుచికా! నీవు మిక్కిలి పుణ్యాత్ముడవు. మరియు మాకును బ్రభువైన హరిభక్తుడగువాని కుమారుడవు. నిన్ను గౌరవము చేసే యిందుండి పంపవలయును. కావున నీ యభీష్టమైన కార్యమొక్కటి దెలుపుము. దానినిచ్చి నీ వలసిన చోటున కంపెదమని పలుకగా నేనిట్లంటి. దేవా !

సీ. ముజ్జగంబులనెల్ల ముదమొప్పనేలునా
               హరి కగ్రజన్ము నిందరయగంటి
    బుద్దికి నుపమానభూతుడౌ సురపురో
               హితునితో నేడు భాషింపగంటి