పుట:కాశీమజిలీకథలు -02.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

కాశీమజిలీకథలు - రెండవభాగము

వటకాదా? సరిచూచుటకయి నిన్నను బృహస్పతిగారి యింటికి బోలేదటే. దాన గోపము వచ్చి యాయన మాతండ్రితో జెప్పెను. నేను దొందరగా బోయితిని. తరువాత నీ వేమి చేసితివి చెప్పుమని యడిగిన జయంతునికి దిలోత్తమ యిట్లనియె. జయంతా! నావృత్తాంత మేమని చెప్పుదును నీవు దారిలో నన్ను విడిచిపెట్టిపోయితివికదా! నేనును విమానశాల దగ్గిరకు బోవువరకు నక్క డొకరక్కసుడు నన్ను బట్టుకొని బలాత్కారముగా దీసికొనిపోయెను.

నే నెన్నియో కేకలు పెట్టితిని కాని నామొర నాలించువారు లేకపోయిరి. వాడు నన్నొక పర్వతదుర్గమునకు దీసికొనిపోయి యందొక గుహాముఖమున నునిచి తనతో భోగింపుమని చెప్పెను. నేనును సమ్మతింపక వానిని బెక్కుతెఱంగుల నిందింప దొడంగితిని. అప్పుడు వాడు రోషకలుషితహృదయుడై కన్ను లెఱ్ఱంజేయుచు దనచేత నున్న చంద్రహాసము జళిపించుచు నీవిందులకు సమ్మతింతువా! లేక నీశిరము ఖండింపనా యని యడిగెను.

నేనప్పుడు భయపడి యోహో! తరువాత జూచుకొనవచ్చు నీ గండము గడచినంజాలునని యూహించి ఓరీ! నేను నీయభీష్టము దీర్చెదను కాని నీవిప్పు డశుచిగానుంటివి. ఇట్టి సమయంబున గ్రీడింపరాదు. స్నానము చేసి వచ్చి దార్చి నాయొద్దకు రమ్మని పలుకగా వాడు సంతసించుచు నాచంద్రహాసమందుంచి యందున్న చిన్నకాలువ కభిముఖముగా బోరగిలంబడి చేతులతో నెత్తిమీద నీళ్ళు పోసుకొనుచుండెను. ఆ సమయముచూచి నేను మిక్కిలి సాహసముతో నా చుద్రహాసము గయికొని వాని కంఠముమీద గట్టిగా వయిచితిని. ఆ దెబ్బతో వానితలతెగి కొండచరియవలె దొర్లి దొర్లి వెల్లువలో గొట్టుకొని పోయినది

వానినట్లు సంహరించి నేను స్వర్గమునకు వచ్చు దారిగానక చింతించుచు నాపర్వత శిఖరమెక్కి కుమ్మరుచుండ విహారార్దమయి కింపురుష మిధునమొకటి యచ్చటికి వచ్చినది. నే నప్పుడా మిధునము కడకుబోయి నాపేరు జెప్పితిని. వారును గురుతుపట్టి నన్ను దమ విమానముపై నెక్కించుకొని యప్పుడే బయలుదేరి యీ యూరి తోపులో దిగబెట్టిబోయిరి. పిమ్మట నేనింటికి వచ్చితి. ఇదియే నావృత్తాంతము. బృహస్పతిగారును దేవేంద్రుడుగారును గోపముజేసిన నేనేమి చేయగలదాననని చెప్పినది.

ఆ మాటలువిని నేను దాని సమయస్ఫూర్తికి వెఱగందుచు స్త్రీల మాయ లిట్టివిగదా యని శంకించుకొనుచు దానియిడుమల కన్నిటికి నేనేగదా కారణమని గర్హించుకొనుచు నామరుగున నణగియుంటిని. కలికీ! ఇంకొక్కటి వినుము విహారార్ధమై పోయినసంగతి మా తండ్రికిం దెలిసినచో నన్ను నిందించును. నీపుణ్య మీరహస్యము