పుట:కాశీమజిలీకథలు -01.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అవ్వా! మే మివ్వీటి కేలికలమై యుందుము నీవు మా యిరువుర నడుమను దల్లిగా మెలంగుము ఎల్లపనులు నీ మీదుగా నడిపించుకొనియెదము. నీకే కొరంతయు రానీయము. చింతవిడువుము. వేయేల? మేము నీ యాజ్ఞకు లోనై మెలంగువారము. లేలెమ్మని రమ్మని బ్రతిమాలు నా భూపాలసూనుని యనునయవాక్యంబుల దేరినదానివలె నభినయించుచు నతని గుణగౌరవము పెక్కుగతుల గొనియాడి యల్లన లేచిన నతండు తన యుత్తరీయము దానికి గట్టనిచ్చెను . అప్పుట్టంబు గట్టుకొనిన యా దుష్టురాలిని వెంటబెట్టుకొని యాడుతోడు దొరకెనను సంతాసముతో నా రాజకుమారుం డంగనతో ముచ్చటించుచు గోటలోని కరిగెను.

పిమ్మట నా వృద్ధయు వారిద్దరి నడుమ మిగుల నమ్మకమైన వర్తనముల మెలంగుచు నాహారమిచ్చునప్పుడును అలంకరించుచున్నప్పుడును నభ్యంగనాదిసంస్కారముల జరుపునప్పుడుసు వారి చిత్తవృత్తుల కనుగుణ్యమగురీతి నెరపుచు దుదకు వారి దా జెప్పినట్లు నడచుకొనువారిగా జేసికొనియెను.

అతండును తన భార్యకు దోడుగలదు గావున వేటకై యడవి కరిగి రెండు మూడు దినములవరకు యదేచ్ఛముగా గ్రుమ్మరివచ్చుచుండును. ఇట్లు కొన్నిదినముల లరిగిన వెనుక నొకనాడత డడవికరిగిన యప్పు డప్పడతి మెత్తదనము గనిపెట్టి యల్లన యావృద్ధ యిట్లనియె.

వాల్గంటీ! యొంటిగా మన మిక్కోటలో నుంటిమి. కోటదాటినచో బెడిదంపుటడవియు గ్రూరమృగములేకాని మానిసి యెవ్వండును గానంబడడు. నీ మగడు మిగుల బలశాలియగుట నిట్టిచోట మనకే కొరంతయు లేకున్నది. నోటననినం దప్పుగాని మానవశరీరములు శాశ్వతములు గావుగదా. అతడుముందో మనము ముందో యెవ్వరు చూచినారు. మనకన్న నతనికి ముందర మోసము సంభవించినచో మన బ్రతుకేమి కావలయు? నే నిట్లంటినని మరియొకలాగున భావింపకుమీ! ఎన్నడో రాబోవు ననర్థమున కిప్పుడే ప్రతీకారము జింతింపవలయునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. నా జీవితము మీ యధీనము జేసితి. నాకు మీకన్న యాప్తులు లేరుకదా! మీరు క్షేమముగా నుండుట కంటె నాకు గావలసిన దేమున్నది! ఎల్లకాల మిట్లుండ భగవంతుని బ్రార్థించుచుంటిని కాని మన యిష్టానుసారముగా గాలము నడువదు. "కాలోయం దురతిక్రమః" యను వాక్యమునుంబట్టి నే నిట్లు చింతించుచుంటిని.

కావున మగువా నీ మగని యాయుర్విషయమై కాలమితి యెరుగునేమో యడుగుము మనవారికి జాతకముల వలనగాని సాముద్రికమువలనగాని యాయుర్మతి దెలిసి యుండును, అమ్మర్మము మనకు దెలిసినచో నిర్భయమైన యానంద ముందుదముగాక- నే నడుగమనిన ట్లడగకుమీ! యతని మానసమున కేమి తోచునో అట్లడిగి ననాయాస