పుట:కాశీమజిలీకథలు-12.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యడుగుటయు వాడు దేవా ! ఆ వృత్తాంతముగూడ నేనెరుంగకపోలేదు. ఈమేయే నాడు మిమ్ముల బ్రాణేశ్వరునిగా గోరిన నారీశిరోమణి. అగ్ని శోధితమగు, సువర్ణంబు లీల నీ బాల వన్నెకెక్కినది. ఎన్నెన్ని సిలుగులం బడినను తన శీలము గాపాడుకొన గల్గినది. ఎచ్చ టెచ్చటకు ద్రిప్పబడినను జివురకు మీరున్న ప్రాంతమునకే వచ్చి చేరి నది. మీ యిరువురం గలుపుట దైవసంకల్పమై యుండవచ్చును. ఇట్టిదాని కెవ్వరేమి ప్రతిబంధకము గల్పించినను నిష్ఫలమగును. నేనా నారీమణి నిఁకఁ గలనైనఁ జెడు తలంపునఁ జూడనని ప్రమాణము జేయుచున్నాను. ఇంతటినుండి యామె నాకు తల్లి వంటిది. దేవరకొరకే సరసిజగర్భుఁడావిరిబోణిని నిర్మించెను. నాకిఁక నాగలోకమునకుఁ బోవ సెలవొసంగి యాయంగనామణిని బత్నిగా స్వీకరించి స్వర్గసుఖములఁ బొందుఁడు. అని పలుకుచున్న వానితో నాపుడమియొడయఁడు దయామేదురహృద యారవిందుఁడై గంభీరవచనముల నిట్లనియె.

ఏ యంగనామణీ యాక్రోశమువిని తదన్వేషణమునకై భూలోకమునుండి యీ లోకమున కేతెంచితినో యాతరుణీమణిని మంచితనముచేత, గాకున్నను నీవు నా సన్నిధింజేర్చి నాకు కొంతశ్రమ తగ్గించితివి. ఈ యుపకారమునకుఁ బ్రతిగా నీ తప్పు లన్నియును సైరించి క్షమించి విడిచిపుచ్చుచున్నాను. పొమ్ము పశ్చాత్తాపము బొందుట వలన బ్రతికిపోతివి. ఇఁకఁ నెన్నఁడునిట్టి యకార్యకరణములకుఁ బూనకు మని చెప్పి వాని నప్పుడే పంపివేసెను. వాఁడును మ్యత్యుముఖమునుండి యీవలఁబడినట్లెంచుచు నిజ నివాసమునకుఁ బోయెను.

ఈ సంవాద క్రమంబంతయు నాలించుచున్న యనంగమోహిని తటాలునఁ దలుపుదీసికొని యావలకువచ్చి మనోహరా ! రక్షింపుము. రక్షింపుమని దివోదాసుని పాదములంబడి తాఁబడిన యిుడుమలం దలచికొని వెక్కివెక్కియేడువఁ దొడంగినది. ఆ రాజేంద్రుడామెను లేవనెత్తి యక్కునంజేర్చుకొని యశ్రజలములనిజోత్తరీయమునఁ దుడుచుచు గాఢానురాగమున ముంగురులు సవరించుచుఁ బ్రీతిపూర్వకముగ మోము నివురుచు మోహాతిరేకమునఁ జెక్కులుముద్దుంగొనుచు నామె శోకమంతయును దృటిలో మరపు జెందునట్లు సుధాధారలొలుకు పలుకులం ననునయించుచు మఱియు నిట్లనియె.

హృదయేశ్వరీ ! ఎన్నెన్ని బన్నములఁ బెట్టినను దైవమునకు మనయం దిప్పటి కనుగ్రహము కలిగినది. గతించినదానికి వగవకుము. ఇఁకనిన్ను నా యరచేతు లందు బెట్టుకొని సంరక్షించుకొందును. నీకే భయమునులేదు మనమున స్వస్థతతం బొందుమని యూరడించుచున్న మనోహరునకేమియును మాటలవలనఁ బ్రత్యుత్తర మొసంగజాలక వాని హృదయమున శిరముమోపి గాఢాశ్లేషమొనరించుటయే సమా ధానముగా మెలంగెను.

ఇంతలో వారియుదంతమంతయునుఁ బరీక్షించుచున్న గుణవతియును