పుట:కాశీమజిలీకథలు-06.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్వవంతుని కథ

103

మునకు సత్వవంతుని తొందర పెట్టెను. ఏనుగులవలెఁ బలిసియున్న యెనుబోతులనెక్కి యిరువురు ధర్మదేవతలవలె నొప్పుచు నతిజవంబున నయ్యరణ్యంబులు దాటి యనేక జనపదంబులు సూచికొనుచు నొకనాడు మధ్యాహ్నమునకు శోభావతీయను పట్టణంబునకుం బోయి యందు విఫణి మార్గంబుల సంచరింపుచుండిరి.

విద్యారూప పరాక్రంబుల గురుస్మరనరులం దిరస్కరించుచు విలు నమ్ములు ధరించి రాజమార్గంబునఁ దిరుగుచున్న సత్వవంతుంజూచి ప్రజలు విస్మయపడఁ జొచ్చిరి. పురరక్షకులు దిరియుటకు వెరచుచుండిరి. అంతలో నొకదెస కోలోహలధ్వని వినంబడినది. అందరు నా దెశకుఁజూచుచుండ గొందరు రాజభటులు యుద్ధసన్నాహములతో వచ్చుచుండిరి. అ వీరభటులు సత్వవంతునింజూచి నీ వెవ్వఁడవు? ధనుర్బాణములు ధరించితివి. నీవు వీరుఁడవా? లేక పిట్టలం గొద్దెదవా? యని సపరిహాసముగా నడిగిన నతండు మొగమంతయుఁ గన్నులు చేయుచు ఏమీ? మీ కండకావరము కానిండు నేవీరుఁడ గానుగాని మిమ్ము బిట్టలం గొట్టినట్టు కొట్టగలనని తిరస్కార భావముతోఁ బ్రత్యుత్తరమిచ్చెను.

ఓరీ ! నీచా ! మే మెవ్వరమో తెలిసికొనక దురభిమానమునఁ బ్రేలితివి. రాజుగారి ప్రధానవీరులమని తెలిసికొనుము. సంగరమునకే యరుగుచున్న వారము. తప్పుఁ బల్కితివని మాకు మ్రొక్కుము. మ్రొక్కవేని నీశిరము భూతబలిగానిత్తుము. అప్పుడు మాకేమియు నడ్డములేదని బెదిరించిన నతండలుగుచు నిలుఁడని యదలించుచు వారిసంధించి పది వాడితూపుల నేసి వారినెల్లఁ బలాయితులం గావించెను. ఆ వీర యోధులు శరబాధ సైపక కాందిశీకులై రాజునొద్దకరిగి య త్తెరం గెరింగించిరి. ఆ నృపతి యపరిమితముగా నాశ్చర్యమందుచు మి మ్మందర నొక్కఁడు పారదోలెనని చెప్పుచున్నారు. అది కడుచోద్యము. అయ్యసహాయశూరునిపై మనము కినియరాదు. సానునయముగా రప్పించి కార్యము సాధించుకొనవలయు నతం డర్జునుఁ డంతటివాఁడు కానిచో నొక్కరుఁడు పదుగురతో ఢీకొనునా? అని యాలోచించి రా జతనిం దీసికొని రండని తనమంత్రులకు బోధించి యంపెను.

ఆ ప్రధానులా సత్వవంతునొద్దకరిగి తదాకారగౌరవము గౌరవము సూచింప వినయముతో మ్రొక్కుచు సుబలా ! ఇవ్వీఁతు శశాంకుడనురాజు పాలించుచున్నాడు మీపరాక్రమమువిని యమ్మహారాజు మిగుల సంతసించుచుఁ దమయోధులఁ చాల మందలించెను. మీవలన నొకసహాయము కోరఁదలఁచి మిమ్మిచ్చటికిఁ తీసుకొనిరమ్మని పుత్తెంచే. పోవుదము రండని వేడుకొనుటయు నవ్వు మొగముతో నోహో! మీరు నన్నంతగాఁ బొగడవలదు రాజాజ్ఞకు బద్ధుఁడనై యరుదెంచెద. మీరు పదుఁడు. నా ------------- పనిమీద నవ్వలికింబోయె నతండు వచ్చినతోడనే వచ్చువాడనని ----------------------------

అయ్యా ! మేము మీరువచ్చుదనుక నిందేయుండెదము మీ మిత్రుడు రానీ