Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్న మస్తు

కాశీ మజిలీ కథలు

ఆఱవభాగము

ఏబదియేడవ మజిలీ.

క. శ్రీ కాశీనగర వరా
   లోకమున సమ్మోద మెడదఁలో బలియన్ సు
   శ్లోకుడుఁ మణిసిద్ధుం డ
   య్యేకాంతచ్చాత్రుతోడ నేగుచుఁ గడకున్.

ఏబదియేడవ మజిలీయందు సమాచరిత నియతక్రియా కలాపుండై తత్ప్రదేశ విశేషంబులం జూడఁబోయిన గోపకుమారుని యాగమనం బభిలషించుచున్నంత నయ్యంతేవాసి యా ప్రాంతమునందలి వింత లన్నియు నరసినాఁడు తనకేదియుఁ బ్రశ్నావకాశంబునకుఁ దగిన విషయంబు బొడగట్ట యిట్టట్టు చూచుచువచ్చి తాను వసించిన మఠముకుడ్యమునందలి లిపి విశేషంబుల నన్నియుం జదువుచు.

గీ. పెండ్లియాడననుచు బిగియించుకొనియున్న
   ముగుదఁ గోరికొనియె ముగుర మగల
   నెలతుకులవ్రతంబు నీటిపైఁ జేవ్రాలు
   గాలిఁ గదలు దీపకళిక సూవె.

అని యొకదెస వ్రాయఁబడియున్న పద్యమును జదివి యుప్పొంగు నంతరంగముతో నయ్యవారి క తైరం గెఱింగించి దాని యర్ధంబు సెప్పుమని కోరిన నతఁడు --------- దదుదంతమ్మణి మహిమంబునం దెలిసికొని యాశ్చర్యం --------------- హృదయుండై భుక్తనిరవశిష్టుండై యున్న శిష్యుని కాకథ యిట్లని చెప్పం