(41)
కాళిదాసు కథ
321
వును, వెదకుచుఁ దొట్రు పడుచుండిరి. అట్టి యద్భుత కల్పనగల శ్లోకమును విని బోజుం డపరిమితానందముఁ జెందుచుఁ తూర్పు దిక్కుముఖంబు మాని దక్షిణ దిశకుఁ దిరిగెను. అప్పుడతండు క్రమ్మర నీశ్లోకముఁ జదివెను.
శ్లో. నీరక్షీ రేగృహిత్వానిఖిలజగతతీర్యాతి నాశీక జన్మా
రర్వానుత్తుంగ శైలాన్ దహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
తక్రం ధృత్వాతు సర్వానటతి జలనిధీన్ చక్రపాణి ర్ముకుందః
వ్యాప్తాత్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతేః భోజరాజక్షితీంద్ర.
అట్లు నీ కీర్తికాంత మూడు లోకములలో వ్యాపించి యందలి వస్తువులన్నియుఁ దెలుపుఁ జేయటయు దుగ్దోదకములఁ గలిపి బ్రహ్మపక్షుల వెంబడి తిరుగు చుండెను. ఫాలాగ్ని ప్రజ్వరిల్లఁజేసి శంకరుఁడు గిరి బృందముల నరయచుండెను. చల్లఁ దీసికొని వెన్నుండు సముద్రముల కరుగుచుండెను. అట్లు తిరిగి త్రిమూర్తులు తమతమ వస్తు వాహనములం దెలిసికొనిరి.
ఆ శ్లోకము విని బోజుండు పశ్చిమ ముఖముగాఁ దిరిగెను. అప్పుడా కవి యీ శ్లోకము పఠించెను.
శ్లో. స్వర్గాద్గోపాల ! కుత్రవ్రజసిసురమునేధ ! భూతలే కామధేనో
ర్వత్సస్యానేతుకామ స్తృణచయ మధునాముగ్ధ ! దుగ్దనఁతుస్యా
శ్రుత్వా శ్రీభోజరాజ స్రచురవితరణం వ్రీడశుష్క స్తనీస్మాత
వ్యర్దోహిస్యాత్ప్రయాసస్త దపితరిభిశ్చర్వితం సర్వముర్వ్యాం.
నారదునకును గొల్లవానికిని సంవాద రూపముగా నీ శ్లోకము రచించెను.
నారదుఁడు - గోపాలా ! స్వర్గమునుండి యెక్కడికిఁ బోవుచుంటివి ?
గోపాలుఁడు -- సుర మునీంద్రా? కామధేనువు దూడకు గడ్డి నిమిత్తమై భూతలంబున కరుగుచున్నాను.
నార --- ముగ్దుఁడా 1 వింతమాటలు చెప్పుచుంటివా ? ఎల్ల వారి కోరికలు దీర్చెడు కామధేనువునొద్ద పాలు లేవా యేమి?
గోపా - లేకయే గడ్డికొర కరుగుచున్నాను. భూమియందెవ్వడో బోజ మహారాజను మహాధాత గలఁడట. వారి ధాతృత్వము విని కామధేనువు సిగ్గుపడి -------------- కాదు గంతయు నెండిపోయినది.