పుట:కాశీమజిలీకథలు-06.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యొక సన్యాసి మా తల్లితోఁ జెప్పుచుండ వింటిని. అట్టి లక్షణములన్నియు మీ యందుఁ గలిగి యన్నవని లోకులవలన నెరింగి మీరు నాకు భర్త లగుదురని నిశ్చయముతో మా తండ్రి నిశ్చయించిన వరుని నిరసించి యిల్లు వెడలి వచ్చితిని. మంత్రులు మిమ్మెట్లో దాటింతురని‌ నాకు ధృడమైన నమ్మకము గలిగియున్నది. అందులకే భువనేశ్వరీదేవి యరణ్యమున కరుగుటకు. నిశ్చయించుకొంటి. నేటికి నా నోములు పూర్తి యయినవి. తపంబు పలియించినది. మిమ్ము విడచి యిక యరనిమిషము మరియొకచోట వసియింపను. నన్నుఁగూడ మీ తోడ దీసికొనిపొండు. అని కోరికొనుటయు నతం డంగీకరించెను. ఇరువురు చెరియొక గుఱ్ఱమెక్కి. పరిజనులతో గూడ నలకాపురాధిముఖులై యరిగిరి.

అని మణిసిద్ధుండు వెండియు నిట్లు చెప్పఁ దొడంగెను.

తొంబది యైదవ మజిలీ

చంద్రముఖి కథ

అమ్మా ! అదికలకాదు. నిక్కువమె. నా కన్నులార నా సన్యాసిం గంటి. వాఁడు నాఁడు మనయింటికి భిక్షకు‌ వచ్చి నన్నుఁ బెండ్లి యాడుమని కోరిన నీచుఁడే. నేను భటులచేఁ ద్రోయించితి‌నని యప్పు డుగ్గడించెను. ఆ పాపుఁడు నన్ను నిర్భందించుచుండ నెప్వఁడో పుణ్యాత్ముఁ డొకఁడు విగ్రహము చాటుననుండి వచ్చి క‌త్తిచే వాని కుత్తిక నరికివైచెను. ఆ సుందరుని మోము చందమామ యనియె భ్రమఁ జెందితిని. అప్పు డెవ్వఁడో వేల్పువచ్చి నీ కేమి కావలయునని యడిగిన నా సేమముకోరి మీకన్నెమిన్న నింటికిఁ బంపుమని యతండు ప్రార్థించెను. కన్ను దెఱచిచూడ మనయింటిలో నుంటి. ఇంతయు రెండు గడియలలో జరిగినది. నన్ను రక్షించువాని మొగము చిత్త రువు వ్రాయఁగలను. వాని‌ పోలిక యంతయు మనంబునం బట్టియున్నది. అని కేయూరపురంబునఁ జిత్రాంగదుని కూఁతురు చంద్రముఖి యను చిన్నది ముచ్చటించుటయు దల్లి యిట్ల నియె‌ పుత్రీ ! నీ వింత ----దాన వేమే ? కొన్ని కలలు యదార్దముగా జరిగి‌నట్లే యుండును. కలలోఁ జూచిన వారిని చిత్రపటంబున వ్రాయవచ్చును. అదియొక' యక్కజముకాదు. స్వప్నఫలమును గురించి విచారింపవలసియున్నది. కలలోఁ బరివ్రాజకుండు కనంబడ రాదండ్రు. ఎట్ల యిన నెవ్వరోవచ్చి విడిపించిరని చెప్పితివి కావునఁ జివురకు మంచదియే అని చెప్పి‌నఁ దల్లి నాక్షేపించుచు జంద్రముఖి అమ్మా ! నిజముగా జరిగినదని చెప్పుచుండ ఫలము‌ లాలోచించెద వేమిటికి ? నే నా గుడిలోఁ జూచిన వాని వెదకి తెప్పించెదవేని వానిఁ బెండ్లి యాడెద. లేకున్న నిట్లెయుండెదనని పలికినది.

ఆమె నవ్వుచు నీ మాట వినినంత బాణునికూఁతురు ఉషాకన్య జ్ఞాపకము