Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

చంద్రముఖి కథ

303

వచ్చుచున్నది. చిత్రలేఖవంటి సఖురాలు గలిగియున్న నీవు సూచిన వానిందీసికొని రాఁ గలదు. అని పరిహాసముఁ జేయుచు రెండు గడియలలో నెక్కడికో పోయివచ్చితి నని చెప్పిన నెవ్వరు విశ్వసింతురు. కలగాదు నిజమనిన నీ మాట వెఱ్రి కుదిరినది‌. రోకలి తలకుఁ జుట్టుము. అని నిట్లున్నది. నీ తండ్రి నీ నిమిత్తమై స్వయంవరము చాటించిరి. పేరు నొందిన రాజపుత్రులలో నెవ్వఁ డెక్కుడు బంగారముఁ దీసికొనివచ్చునో వానికి నిన్ను బెండ్లి చేయదురట. సంపదలతో నన్ని లక్షణములు గలియుండును అని చెప్పినది. చంద్రముఖి తల్లి కేమియు సమాధానము జెప్పక యప్పుడే తండ్రికొక యుత్త రమిట్లు వ్రాసినది. జనకా ? కనకమున కాసఁ జెందిన వరునివిద్యా గుణంబులు పరీక్షింపక యెట్టి నీచునకైన నన్నిచ్చుటకు బ్రయత్నించు చుంటివట. ఇది యాభిజాత్య లక్షణముగాదు. స్వయంవరమున కిది యాచారము గాదు. ఉత్తములైన రాజపుత్రుల రప్పించుము. నేనొక ప్రశ్నము నడిగెదను. నా మాట కుత్తర మిచ్చిన వానినే పెండ్లి యాడెద నిదియే నా శపధమని వ్రాసిన క్రమ్మం జదివికొని చిత్రాంగదుడు సంతసించి క్రమ్మర నిట్లు వ్రాసెను.

తల్లీ ! నే నంత యెరుఁగనివాడను కాను. ఊరక స్వయంవరము చాటించితినేని గొఱమాలిన వారందరువచ్చి సభలో జోటులేకుండ జేయుదురు. పది శకటముల బంగారమునకు దక్కు_వ తెచ్చినవాని నా సభకు రానీయను, అట్లు తెచ్చిన వానినే నీ ప్రశ్ననడుగుము. నీ యిష్టము వచ్చినవాని నేరికొనుము. కన్నెకలు కేవలము రూపమున‌ కాసపడి సిరిలేనివారిని వరించి పిమ్మట నిడుమలం గుడువగలరు. కావున నీ విందులకు జింతింప వలసినపని లేదని |పత్యుత్తరము వ్రాసెను.

అందుల కా సుందరియు సంతోషించి దానియ్య దలచికొన్న ప్రశ్నము శ్లోకరూపముగా రచియించి సమయమున కెదురు చూచుచుండెను. ఇంతలో నా చంద్రముఖిని వరంచియున్న రాజపుత్రులందరు తమతమసామర్ద్యము ననుసరించి బండ్లపై బంగారము వైచికొని యా పష్టణమున కరుదెంచియుండిరి. సామాన్యముగా నా రాజపుత్రులలో నూరుబండ్ల బంగారము దెచ్చినవా డరుదుగ నున్నారు. ప్రధానులు వారు తెచ్చినబంగార మంతయు లెక్కలు వ్రాసి‌ యప్పగించుకొని విలాసములతో గోశాగారంబుల బడవైచి వారి వారి నామములు వ్రాసి చిత్రాంగదునియొద్డ కనుపుచుండిరి.

బోజకుమారుండును లీలావతియు నలకాపురమున కరుగుచు మార్గవశంబున నా పురంబున కరిగిరి. బోజుం డా వార్తవిని లీలావతితో బ్రేయసీ ! ఎల్లుం 4 బం ంముంయవ రాజప్ప తికకు స్వ యంవర మహోత్సవము "జరుగునట, ననా టు వెంఆత యు రాజప్పుతులు పేక్యందుం వచ్చుచున్నాడు, ఆ వింతచు వింటా! తున యషగిన నప్పవత చిన ;పతో. దేపర కిష్టమే వ