Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

280

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

దేవా ! నేను దేవరయనుజ్ఞకొని యరదముతోఁ బాఠశాల కరిగితిని. పిలిచినంతనే యా రాజకుమారుఁడు నన్నుఁ బాదరక్షతో దవడ మీద గొట్టెను. పిమ్మట నరణ్యమునకుఁ దీసికొని పొమ్మని యున్న మీ శాసన పత్రికం జూపితిని. అప్పుడతండు శాసనమునకు బద్దుండై రధమెక్కి నాతోవచ్చెను. ఈవార్త పురమంతయు నంతలోనే వ్యాపించినది పౌరులు పెక్కండ్రు నా రధమున కడ్డము వచ్చి యాటకంముఁ జేయుచు రాజకుమారు నిందు దింపి పొమ్మని యదలించిరి. నా భటులచే వారినెల్లఁ బలాయితులం గావించితిని. మరికొంత దూర మరిగిన తరువాత వీరభటులు కొంద రాయుధపాణులై వచ్చి యా రధము చుట్టు ముట్టడించిరి. అప్పుడు భోజకుమారుఁడు సానునయముగా వారిని వారించుచు రాజ శాసన‌ మెవ్వరును మీరరాదు. మంచి చెడ్డలు విమర్శింపఁ ప్రజల కధి కారములేదు అట్లెయిన రాజ్యము సేయుటయే సాగదు. అని యే మేమో బోధించుచు వారి యాటంకము మానిపించెను.

కొంత ప్రొద్దు పోయిన తరువాత నయ్యడవి కరిగితిమి. నన్నేమిటి కిట్లు తీసికొనివచ్చితిరి ? రాజ శాసనము నా కేమిశిక్ష విధించుచున్నది. అని యడిగిన నేను జెప్పలేక చివురకు నిన్ను జంపుటకే ఇక్కడికిఁ బంపిరని రెండవ శాసనము జూపితిని. అప్పుడతం డించుకయు విచారింపక నవ్వు మొగముతో నోహో ? దీనికంత వింత పడనేమిటికి ? హారిశ్చంద్రుఁడును. నలుఁడును శ్రీరాముఁడును నెట్టి సామర్థ్యము గలవారు అట్టివారు రాజ్య భ్రష్టులై యెన్ని బాములంబడిరి. ఎల్లవారును గాలవశంబునఁ జెడిపోవుచుందురు అట్టి వారిని రక్షించువారెవ్వరు ? మంచివార్తఁ జెప్పితిరి. పిన తండ్రికిష్టము చేయుట నా కెంతయు సంతోషము. వేగ మీ పని కాని‌చ్చుకొనుఁడు. చీకటిలో నింటికిఁబోలేరని యత్యంత శాంతస్వాంతముతోఁ బలికిన మే మెంతయు నివ్వెరఁ జెందితిమి. మృతియన నతని కించుకయు. వెరపులేదు గద. శిరంబు నరకుఁడు. నరకుఁడని వంచుటయుఁ గతులెత్తి “మీ తల్లికిగానిఁ పిన తండ్రికి గాని జెప్పవలసిన మాట లేమైనం గలవా? చెప్పు" మని యడిగితిమి.

అప్పుడతండుతొడఁ జీరి వటపత్రపటంబున రక్తంబుఁ జేర్చి యా యాకులపై నేవియోవ్రాసెను. ఒకటి మీకును నాకండు జయంతునికిని నిమ్మని చెప్పెను. తరువాత నాకుమార శేఖరుఁడు హరిస్మరణ జేయుచు కన్నులు మూసికొని మోడ్పు చేతులతో శిరంబు వంచిన నిర్దయులమై నరికి తీసికొనివచ్చితిమి మిదియే వృత్తాంత మని చెప్పి యాపత్రికలిచ్చి వత్సరాజు పరివారములతోఁ దన యింటికిం బోయెను.

అప్పుడు ముంజుఁడు జయంతుని కిచ్చిన పద్యమును ముందుగా నిట్లు చదివెను.

న్యు నావొక పొత ముకం చరి. బరోపకార 4
మరకుమా 1 ధరసబనకోటితోడ స
పంపును? ఇలునగా. దలపోయకుమూ ? గురుని నీ
బూర్వకర్మ దురితంబిది నాకు భరింపగాఁ దగున్‌.