జయంతుని కథ
277
తొంబది మూడవ మజిలి
జయంతుని కథ
శోభావతి - ప్రాణేశ్వరా ! మీ కుమారుఁడు జయంతుఁడు మిమ్మేదియో యడుగుటకు వచ్చి వెరచుచున్నాఁడు పిలువుఁడు.
ముంజుఁడు - వత్సా ! రమ్ము. నా యొద్ద సందియ మేమిటికి ? నా కృషియంతయు నీ నిమిత్తమేకాదా ? నీ కేమి కావలయునో యడుగుము. ఇప్పుడే యిప్పించెదను.
జయంతుఁడు - (కన్నీరుఁ దుడిచికొనుచు) తండ్రీ ! నా కేమియు నక్కర లేదు. మాయన్న భోజకుమారుని భువనేశ్వరీ కాంతారమునకుఁ జంప బంపితివఁట. అతం డట్టి యపరాధ మేమి కావించెను ?
ముంజుఁడు - పట్టీ ! నీవు చిన్న వాఁడ విట్టిప్రశ్నల నడుగరాదు. అపరాధి యగుటచే యట్టి శిక్ష విధించితిని.
జయంతుఁడు - పెద్దవారలు చిన్నవారలై కాని పనులు సేయుచుండఁ జిన్న వారలైన బెద్దరికము వహింపఁగూడదా ? అతఁడు కావించిన యపరాధ మేదియో యించుక వినఁగోరు చున్నవాఁడ. వివరింపుడు.
ము౦జు - పట్టీ ? నీవు వట్టి యమాయకుఁడవుగదా? ఆత్మౌన్నత్య మెరుంగక మాట్లాడుచుంటివి. నే నెవ్వరి నిమిత్త మిట్టిపనిఁ జేసితినో నీవే నన్నాక్షేపించుచుండఁ బెరవారి నన నేల?
జయ - నా నిమిత్తమా? సకలగుణజలనిధియగు భోజకుమారుని జంపించితివి. అక్కటా? నేనెంత పాపాత్ముండ. అయ్యో ? నేను బుట్టకపోయినను నా దయాశాలి జీవించునుగదా ? (అనియురముఁ బాదుకొనుచు దుఃఖించు చున్నాఁడు)
శోభావతి - జయంతా?| వారికి వారియన్న బిడ్డయందు లేనిప్రీతి నీ కేటికి ? మన మంతకంటె దూరమువారము కామా ? ఊరడిల్లుము.
జయంతుఁడు - తల్లీ ! వానిగుణంబుల నీవేమి యెరుంగుదువు. నన్నుఁగన్నబిడ్డకన్న నెక్కుడు గారాబముగాఁ జూచు వాడుగదా ? “మాతండ్రి నెరుఁగను. ముంజుఁడే మా తండ్రియని” సంతసముతోఁ బల్కుచుండును. అట్టి పుణ్యాత్ముం జంపి రమ్మనుటకు నో రెట్లాడెనో తెలియదు. విను మొకనాఁడు మే మిరువురము నడవికి వేటకుఁ బోయి యం దందుఁ దిరుగుచుండఁ పరిజన మించుక వెనుకబడుటయు నొక వరాహము వెనువెంట వచ్చి నా తొడ జీరి పారిపోయినది. అప్పుడు నా యంగమునుండి బొటబొట రక్తము కారినది. నా గాయముఁ జూచి యడ ------------------ నన్నెత్తుకొని యొకపాదపమునీడకుఁ దీసికొనిపోయెను. నడచునప్పుడు