ముంజుని కథ
275
పడియెను. వశిష్టునిదైవజ్ఞత్వ మెట్లయినది. అంతకన్న నీ విప్రుండు ఘనుఁడా! అదియునుంగాక దెవజ్ఞులు గత మెరింగిన ట్లాగతముం జెప్పఁజాలరు. అది యట్లుండె. ప్రాజ్ఞుండేపని చేసినచో నిట్టి యుపకార మగును. చేయనిచో నిట్టి యపకార మగునని యాలోచించి చేయుంగదా ? ఉచితానుచిత కార్యంబు లాచరించునప్పుడు పండితునిచే దత్పలం బెంతయో యవధరింపవలయును. తొందరచేఁ గావించిన పనులయొక్క పరిపాకము హృదయశల్యమై చివురకు బాధింపక మానదు.
ఈ భోజకుమారుం జంపించిన వృద్దరాజునం డభిమానముగల సైన్యంబులు తిరుగఁబడి అల్లకల్లోలముగాఁ బట్టణమును వ్యాకులము చేయక మానవు. నీవీ రాజ్యముఁ బాలించుచున్నను బ్రజలు భోజకుమారునే భర్తగాఁ దలంచుచుండిరి. మరియుఁ బుణ్యకార్యము లెన్నియో చేయుచున్నను దుర్ణయకార్యకరణం బొందు చమురెంత యన్నను పెనుగాలి దీపశిఖ నార్పునట్టు సంపదల నశింపఁ జేయక మానదు. దేవా! పుత్రవధ యెన్నటికి హితమైనదికాదు. దేవర నా మాట మన్నించి యీ నియోగము మరలించుకొనుఁడని పలికిన నలుకమెయిం గన్ను లెఱ్ఱఁజేయుచు ముంజుం డిట్లనియె.
సేవకుఁడు తనయధికారమునకుఁ దగినమాటలే చెప్పవలయును. ఇంచుక చనువిచ్చిన భృత్యులు నెత్తియెక్కు.దురుగదా? ఇప్పని కార్యాకార్యములగురించి నిన్న డిది నప్పుడీ గొడవ య౦తయుం జెప్పవలసినది. నా విధించిన శాసనమున కెదురాడుట ప్రభు తిరస్కారము కాదా? చెప్పినపని చేయని భృత్యుని పోషించుట జాగళకుచపోషణము వోలె నిరర్దకము సుమీ? అని కోపోద్దీపిత మానసుండై పలికిన విని వత్సరాజు కాలోచిత మాలోచింపపలయునని తలంచి మారుమాట పలుకక మహా ప్రసాదమవి యప్పని కొప్పుకొని యప్పుడే బయలువెడలెను.
ఉత్తుంగసౌధోత్సంగమునుండి వడి వడి దిగుచున్న యతనిగమనవేగముఁ జూచి సభాసదులు భయపడుచు నేవియో నెపములు పన్ని తమ నెలవులకుంబోయిరి. అప్పుడు వత్సరాజెవ్వరితో మాటాడక తన యరదమెక్కి పాకశాలయొద్ద కరగి వీధి నిలువంబడి యుపాధ్యాయుఁ దీసికొనిరమ్మని యొకభటు ననిపెను. సేవకుఁడు వోయి వత్సరాజు నిర్దేశ మెరింగించుటయు జడియుచు నా యొజ్జ లతిజపంబుల నచ్చటి కరుదెంచెను. వత్సరాజు నమస్కరించుచు తాతా ! పండితప్రవర ! ఇందు గూర్చుండుము జయంతకుమారుఁ డేమిచేయుచున్నవాడు. అని యడిగిన భోజకుమారునితోఁ గలసి యేదియో చదువుచున్నాఁడని చెప్పెను.
ఒక్కసారి యిచ్చటికి రప్పింపుమని చెప్పిననతండు తన శిష్యునంపి పిలిపించెను. అట్లు వచ్చిన జయంతకుమారుని జూచి వత్సరాజు ఏదియో యడిగి పంపి భోజకుమారునిగూడ రప్పింపుమని చెప్పెను. అత్తెరంగు విని బోజుఁడు మిక్కిలి యలుకతో ----------గన్ను లెర్రజేయుచు నోరీ దుర్మతీ ! నన్నిక్కడకు రప్పించు