Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

పాండిత్యము. శత్రువుని వ్యాధిని బుట్టినవెంటనే నాశనము నొందింపవలయును. లేనిచో వానివలననే వీనికి నాశనముఁ గలుగును.

ఆ ఫలములును దురంతమును సమవ్యయఫలములును నశక్యములునగు కార్యంబులు చేయుటయు విద్వాంసుఁడెన్నఁడునుబూనికొనడు. అని యాలోచించుచు నా రాత్రియెల్ల నిద్రఁబోక ముంజుండు వంగ దేశాధీశ్వరుండైన వత్సరాజును దీసికొని రమ్మని యంగరక్షకు నొకని నియమించెను. వాడు వోయి యా వృత్తాంత మెరింగించుటయు నా దండనాధుండు రథ మెక్కి పరి పరిగతులఁ దలంచుచు వచ్చి హజారమున నరదము దిగి యొక్కరుఁడ లోనికిఁ బోయి రాజదర్శనముఁ గావించి నమస్కరించెను.

ముంజుఁ డాసదనంబుఁ విజనంబు గావించి యనునయించి వత్చ రాజా ! భృత్యులు ప్రభువులకుఁ బ్రాణము లర్పింతురు. ప్రభువులు భృత్యులు చేసినకార్యములకు సంతసించుచుఁ దగునట్లు గౌరవింతురు. రాజ్యములు భృత్యుమూలములై యున్నవి. ఇప్పుడు నీ వలన జేయదగిన కార్య మొండు కలదు. వినుము. నీవు భోజకుమారుని దీసికొనిపోయి యడవిలో నున్న భువనేశ్వరీదేవి యాలయము మ్రోలఁ బరిమార్చి తస్మస్తకంబుఁ దీసికొని రావలయును. ఇందులకే నిన్ను రప్పించితినని చెప్పిన విని యతండు తెల తెల్ల పోవుచు లేచి నిలువంబడి యిట్లనియె.

దేవా ! మీ యాదేశముఁ గావించుటకు బద్ధులమైయుంటిమి మీలాలనావిశేషంబున నించుక చెప్పుచుంటి, నా మాటలు తప్పైనను మన్నింప వేడెదను.. బోజకుమారుఁ డిప్పుడు చదువుకొనుచున్నాఁడు. మిక్కిలి గుణవంతుఁడు. ద్రవ్యముగాని సేనలుగాని వాని యాధీనములో లేవు. మిమ్ముఁదండ్రికంటె నెక్కుడుభక్తితోఁ జూచుచుండును. పరుషము లాడినవారి నించుకయు నిందింపక మృదుపూర్వముగా సంభాషించును. అపకారశతమైనను స్మరింపక యుపకార మొక్కటియైనను బెద్దగాఁ జెప్పుకొనుచుండును. జ్ఞానతపశ్శీలవృద్దులగు సజ్జనులతో ముచ్చటించు చుండును. గుప్తమంత్రుఁడు ధన్మార్దకామంబుల నెరింగిన ప్రోఢ. సమస్తసద్గుణములకు నెలవగు నట్టికుమారుఁ జంపించుటకుఁ దగినకారణ మేమియని యడిగిన ముంజుండు ప్రొద్దుట సభయందు భోజునిగురించి దైవజ్ఞుండు చెప్పిన వృత్తాంత మంతయు నెరింగించెను.

ఆ మాటవిని పక్కు.న నవ్వుచు వత్సరాజు దేవా ! ఉదరఫోషణకై తిరిగెడు నొక పేదపారుని మాట నమ్మి మన్మధాకారుండగు కుమారునేలఁ జంపించెదవు? తొల్లి బ్రహ్మ పుత్రుండగు వశిష్టుండు శ్రీరాముని పట్టాభిషేకము నిమిత్తము ముహూర్త ----- ఆ ముహూర్తముననే కాదా ------------ సీతతో నడవికిఁ బంపబడెను. అరణ్యమందైనను సుఖముగ నుండిరా? సీతాపహరణమై శ్రీరాముఁడు పెక్కుబాములు