Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(33)

కవి కంఠకౌక్షేయుకుని కథ

257

అని చెప్పి యప్పారికాంక్షి యేతత్క థాశేషం బవ్వలినివాస స్థానంబున నిట్లు చెప్పుచుండెను.

తొంబదియవ మజిలీ

కవి కంఠకౌక్షేయుకుని కథ

రాజపుత్రా ! నీవు మంచి సమయమున వచ్చి నా కుపకారముఁ గావించితివి. నీ మే లెన్నటికిని మరువను. నాఁడు నన్ను వీండ్రు బట్టుకుందురా ? నా చెల్లెలు సరోజిని‌ కపాయము వచ్చునని దాని దాటించుచుఁ గాచికొనలేకఁ బోయితిని. ఈ కత్తియే నా చేత నుండినచో నెంతమంది వచ్చినను బీచ మడపక విడుతునా? ఇఁక నీ కృపాణమేమరక కరంబునఁ దాల్చియుండెద. నీ రాజభటులెందరు వత్తురో చూతుముగాక. నీవు సరోజినిం బెండ్లియాడెదనని యొప్పుకొని మానితివికదా ? అట్టి బుద్ధిమంతురాలు గుణవంతురాలు రూపవంతురాలి పుడమిలోనున్నదియా? ఎవ్వరో భోగముదానయని చెప్పినంతనే నమ్మి యుపేక్షింతువా ? దాని పుట్టువను గురించి తెలిసికొనవలసి యున్నది‌. ఉత్తమవంశ సంజాతయని దానిరూపమే చెప్పుచున్నది. అని పలుకుచు దన కథయు సరోజిని చరిత్రయు ఘటదత్తుఁడు సుముఖనితో నొక నాఁడు వక్కాణించెను.

ఆ మాట విని సుముఖుండు బావా ! నన్ను సుమేధుఁడు వేశ్యాంగనం బెండ్లి యాఁడ కూడదని యంకిలి చెప్పెను. మా కీ రహస్యము లన్నియు నెట్లు తెలియగలవు. అట్ల యినను నేను సరోజినీ గుణపాశ బద్దుండనై యింట నిలువక మీ నిమిత్తమై దేశాటనముఁ జేయుచుంటిని. కాళిందీపురమున కరిగి చంద్రవతి యింటికింబోయి దానితో సంభాషించితిని. ఇంట నున్న విత్తమంతయుఁ బోవుటయే కాక సరోజినిని కూడ నెత్తుకొని పోయిరని మిక్కిలి దుఃఖించుచున్నది. ఆ చిన్నది యున్న వెండియుఁ వెండియుం బైదియుఁ సంపాదించుకోఁ గలనని చెప్పుచున్నది. అది నీ కడుపునం బుట్టినదా యని నే నడిగితిని. మొదటఁ గొంతసేపట్లే చెప్పి చెప్పి చివురకది యట్టిది యయినచో నా చెంతకుఁ గ్రమ్మర రాకుండునా ? దానిం దెచ్చుకొంటి నారండకు నిందుండి పోవలయుననియే యున్నది. అని యదార్ధముఁ జెప్పినది.

అక్కడినుండి బయలుదేరి నే ననేక జనపదంబులు చూచుకొనుచు నిప్పటికి ఎంచి... న్ను. బొడగంటి... నీ వసవాయహారు(గవు. నిన్నర్ధుపనితోం గ సన్నం తెరగా మూఘుకరిన్ను యమం గల రిప్‌. 20 .అలాల. * బతి సంచులు ఎప్పినందులకే సొమున నలి పిళ్య్వాన థి యన ప ముబణంయిలే తన్మాతములే, ఇట మొనలు నేన ని యాజ