(30)
సుముఖుని కథ
233
సుముఖుని కథ
పూవుబోణి - చకోరాక్షీ ! యెంత చోద్యమో వింటివా? ఔరా? ఎట్టిచిత్రములు వినంబడుచున్నవి ?
చకో - ఇక్కడనా? మరియొక చోటనా ?
పూవు -- ఇక్కడనే. మొన్న మంత్రికూఁతురని పేరు చెప్పికొని మన రాజపుత్రులలోఁ బింగలాక్షుడే మణిముద్రికను దీసేనని చెప్పిన చిన్నది యెవ్వతెయో యెరుంగుదువా ?
చకో - ఎరుఁగ నెరుఁగ మంత్రి పుత్రికయనియే వింటిని. ఆమె మిగులఁ జక్కనిదిగదా ? ఆమె మాట యేమిటికి?
పూవు - ఆమె బుద్దికుశలతకు సౌందర్యమునకు వలచి మన సుముఖుఁడు పెండ్లియాడ నిశ్చయించుకొనియెను.
చకో - ఆ చిన్నది క్షత్రియ కన్యకయా యేమి?
పూవు - ఎవ్వతెయో చెప్పెద వినుము. ఘటదత్తుఁడను చిన్నవాఁడును నా చిన్నదియు నీయూరు వచ్చి బ్రాహ్మణుల మనియు నన్నా చెల్లెండ్ర మనియుం జెప్పికొని యీ వీటిలోఁ గ్రుమ్మరుచు మన ప్రధాని గారికి వచ్చిన యాపద విని యా పైదలి మంత్రి కూతుఁరనని చెప్పి యా విపత్తు దాటించినది.
చకో - ఆమె బ్రాహ్మణకన్యయా ?
పూవు - కాదు. కాదు తరువాత వినుము. సుముఖుండా పద్మముఖి యద్భుత కళా వైదగ్ద్యములఁ గాంచి మోహించి వెనువెంట దిరుగుచు మంత్రి నాశ్రయించి నీకు సంతతి లేదని వింటిమే ? ఆ వాల్గంటి నీకొమార్తె యెట్లయ్యనని వినయముగా నడిగెను.
చకో - తరువాత తరువాత.
పూవు - మంత్రి నిజమెరింగించుటయు నతండు మరియు విరహాతురుండై యత్తలోదరిం బెండ్లి యాడినగాని జీవంపనని మంత్రితో జెప్పెను.
చకో - నేను చూచితిని అకుందరవదన సౌందర్య మట్టిదే. తరువాత ?
పూవు - ప్రధాని దాని యన్నతో సుముఖుని చరిత్రముఁ జెప్పి తరువాత నొప్పించి యమ్మి౦చుబోణిని సుముఖునకుఁ బెండ్లిఁ జేయుటకు నిశ్చయించెను.
చకో - బ్రాహ్మణకన్యకను క్షత్రియుండెట్లు పెండ్లియాడుటకు నిశ్చయించి కొనియెను ? అన్న యెట్లంగీకరించెను ?
పూవు - సాంతముగా వినక శంకలు సేయుచుందువుగదా ? ------------ విప్రకన్యక కాదు. కాదు. వెలయాలు చంద్రవతి యను బోగము దానికూఁతురట. ఘటదత్తుఁడు దానియన్న కాడట.