Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అని కుముద్వితీ నగరంబున శారదయను బ్రాహ్మణపత్ని యాలోచించుకొనుచు నొకనాడు నడిరేయి నొరులెఱుంగకుండ నిల్లు వెడలి మెల్లగ నగడ్త ప్రక్కనున్న ------ భూమికిం బోయినది.

సీ. సగము బూడిచిన పీనుగుల నీడిచికొని
            పోవు నక్కల ఘోషముల కులుకక
    చిభిచెంతఁ బోవుచో శిభి పెరేల్లని ప్రేలి
            ఏడుకపాలముల చప్పుడుల బెదర
    కడుగు జారిన గోతఁబడి మేనుదుస్సిన
            శవముల జేతుల నవలఁద్రోచి
    యతిభీమ భూతాట్టహాస నిస్వనముల
            కోసరిల్ల క చెవుల్మూసికొనుచు

గ. చరణములుఁ గ్రూచ్చికొను గీకసములఁ బెరికి
    తెరువెరుంగుచుఁ జితివహ్ని తేజమునను
    గుణపదాహకులకుఁ గొంత కొంకుచచట
    దిరిగె నొక కొంత సేపు భూసురవధూటి.

అట్లు తిరిగి తిరిగి వెర పుడిపికొని తెగువ నప్పడఁతి యప్పరిఘా జలంబున మునింగి యొ‌డలెల్ల బసపుఁ బూసికొని తల విరియఁబోసికొని మండుచున్న యొక కాఁటినికటంబునకుం బోయినది. అందుఁ గూర్చున్న శవదాహనకు లామెంజూచి దయ్యమనుకొని వెరపు జెందుచుఁ దల యొక దెసకుం బారిపోయిరి. అప్పుడా శారద యా చిత్రగ్నిఁ జల్లార్చు తెర వరయుచు నలుమూలలు సూచుచుండ నొక దండ నుండి శిరంబున ఘటం బిడికొని యొక యాఁడుది వచ్చుచుండెను.

దాని నెత్తిపై నున్న కడవ లాగికొను తలంపుతో నెదురుగాఁబోయి యది బెదరునట్లు గాండ్రుమని యరచినది. ఆ పడఁతి యడలిపోయి గడగడ వడంకుచు గడవ నేలపైఁ బారవిడిచి వెనుక తిరుఁగక కాలికొలఁది పరువెట్టినది. ఘటము శకలము లగుటయు నందుండి యొక శిశువు నేలంబడి యేడువఁ దొడంగెను. శారద దాపునకుఁబోయి చూచి యా బాలు నెత్తికొని కాటివెల్తురున వాని లక్షణములు బరీక్షించినది. చేరలకు మీరిన కన్నులు, వెడద యరము, ముద్దుమోము నద్భుత తేజముం గలిగి త్రిజగన్మోహన రూపమునం బ్రకాశించు నా పాపనిం జూచి యాశ్చర్య సాగర కల్లోలముల నోలలాడుచు ఆహా ! ఏమి యీ విచిత్రము. అర్దరాత్రమున నీకాంత యేకాంతముగా ఘటంబున నీ డింభకు నిడికొని రానేల? త బాలుండు మృతుం డయ్యెనని తలంచి యచ్చటికిఁ దీసికొని వచ్చినదా ? అవును. ఆ మాటయే నిక్కువము కావచ్చును. యోగినీ కధిత నియమమునకు మెచ్చి దైవము వీనిం బ్రతికించి నాకిచ్చెనన తోచుచున్నది. వీడు దేవతానుగ్రహముననే నాకు లభించెను. నా నియమముని