Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(26)

కౌముదీకళావతుల కథ

201

గొట్టుకొనుచుండ రెండుగడియలలో గర్భస్రావమైనది. ఆ వార్త విని పాటలిక యార్తిఁ జెందుచు నొరుల కెవ్వరికిం జెప్పక మంజరిక యొద్దకుఁబోయి యోసీ? నేనెంత చెడుపని చేసితినో చూచితివా ? నాఁడయ్యెరుకత దొరసాని కిచ్చిన వేరు దివ్యౌషధమని తలంచి కపటముఁ జేసి కౌముది కియ్యక నీ మఱదల కిచ్చితిని. అది తినిన రెండు గడియలలోఁ గడుపు చెడినది. కౌముదికిఁ గొట్టవలసిన ముప్పు మనలం గొట్టినది. వింటివా? యని చెప్పుటయు నా మంజరిక మిక్కిలి దుఃఖించుచు అయ్యో ? నా తమ్మునికిఁ గొమరుఁ డుదయించునని గంపెడాశఁ బెట్టికొని యుంటిమి. నాతోఁ జెప్పక యప్పని యేమిటికిఁ జేసితివి ? సోది జెప్పెడివాండ్రు పెక్కుమాయలతో వత్తురు. వాండ్రిచ్చునవి యమృతములని నమ్మి గర్భవతుల కీయవచ్చునా ? అని‌ పెక్కుగతుల నిందించుచు నా రహస్యము వెల్లడిచేయవద్దని బోధించినది. మరి రెండు నాళ్ళకుఁ బల్ల విక యరుదెంచి మంజరికతోఁ బట్టీ ? ఇచ్చట విశేషము లేమి? కౌముదికి గర్భస్రావ మైనదా కళానిలయ తెలిసికొని రమ్మన్నదని యడిగిన నది యడలుచుఁ దల్లీఁ పరులం జెరుపఁ దలఁకొనిన వారు తామే చెడుదురు. నీవు పన్నిన కత్తెర నీ సిరమే నరికినది. కౌముదికేమియు లోపములేదు. నీ కోడలిగర్భమే చెడినదని యా వృత్తాంతమంతయు జెప్పినది.

పల్లవిక యురముఁ బాదుకొనుచు అయ్యో ! ముద్దుల మనమఁడు కలుగునని యెంతయో యాసతో నెదురుచూచుచుంటిని. ఆ ముసలి ముండ యీ పని యేమిటికిఁ జేయవలయును ? మనకు దొరకు లాభము కూడఁ జెడిపోయినది గదా? అని పొరటిల్లుటయు మంజరిక అమ్మా ! ఎవ్వరి నిందించినను బ్రయోజనము లేదు. దైవమే యీ కార్యముఁ జేసి మనకు బుద్దిఁజెప్పెను. ఇఁక నిటువంటి పనులెన్నఁడును జేయబూనకుమని బోధిందిన విని పల్లవిక పుత్రీ ! నీ వేదాంతవచనము శాంతించు దాననుగాను. నేను గళానిలయకు బ్రధానదాసిని‌. చేయవలసిన పని తుదముట్టఁజేసి తీరుదనని యేమేమో యసూయాపరవశురాలై పలికినది. ‌ పిమ్మట నిరువురు గళావతియొద్ద కరిగిరి. కళావతి పల్లవికం జూచి పుట్టినింటివిశేషము లేమని యడుగుటయు రాయల వారిచ్చిన కమ్మ యాకొమ్మ కిచ్చినది. దాని నామె చదివికొని భర్త కిచ్చినది. వసుంధరుఁ దాచీటిం జదువుకొని మందహాసము గావించుచు బోటీ ! నీ తండ్రి నిన్నుఁ బంప నందులకు మా తప్పుగా గణించి యేమెమో వ్రాసిరి. పెద్దల నలిగింపరాదు. నీవుపోయి రమ్ము. వారికిం జెప్పియే పురిటికి రావచ్చునని చెప్పుటయు ననుమోదించి యమ్మించుబోణి యమ్మరునాఁడే తగుపరివారముతోఁ పుట్టినింటి కరిగి తల్లిం గౌగలించుకొని వయస్యుల మన్నించుచుఁ బరిచరులనాదేశించు

తల ఆ తలో పం సొంశయననురల్సి పె పంలకుం గలుగదు. నెను నీ నిమిం ల షై ఉప. ఉట ఆ