200
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
నది. దానిని జూచి యచ్చెరు వందుచుఁ గౌముదీకళావతులు విద్వాంసు రాండ్రయ్యు లోకాచారమనుసరించి యెరుకఁ జెప్పించుకొనిరి. అయ్యెరుకతయు దేవతల నగ్గించుచు మంజరిక యడుగుచుండ జరిగినచర్య లన్నియు నిదర్శనముగాఁ బూసఁ గ్రుచ్చినట్లు వక్కాణించి వారినెల్ల నాశ్చర్యవశంవద హృదయులంజేసినది. అప్పుడందఱకు దానియం దధికవిశ్వాసము కలిగినది.
మంజరిక మరలఁ జేటలో బియ్యమువోయుచు మా దొరసానుల కెట్టిసంతానము కలుగునో యెరింగింపుమని సూచించుచు నెరుక నడుగుటయు నది గళావతికి వంశధురంధరుండగు కొమరుం డుదయించునని చెప్పి కౌముది గర్భమున భూతావేశమైయున్న కతంబునఁగొన్ని దినములలోఁ జెడిపోవునని నుడివినది.
అ మాట విని సఖులతోఁ గూడ గళావతి మిక్కిలి పరితపించుచు నోసీ! నీకు మంచి పారితోషిక మిప్పించెద నట్టి విపరీతము జరుగకుండఁ గాపాడగలవా ? యని యడిగిన యయ్యెరుకత నవ్వుచు అమ్మా! ఆమాత్రమెరుక లేక మేమింతదూర మెరుకఁ జెప్పవత్తుమా ? యని పలుకుచు నా పొలఁతి నొసట బసుపుతిలక మిడుచు బుట్టలోని నుండి యొక వేరు దీసి యిది గుర్విణులకు సిద్దౌషదము. రేపు రాఁబోవు గ్రహణదివసంబు రాత్రిఁ దీనిం గలితో నఱగఁదీసి లోనికిం బుచ్చుకొని పండుకొనునది. అయ్యుపద్రవ మెప్పటికిని జరగదని చెప్పి దీవించి యావేరిచ్చినది.
కళావతి యయ్యోషధిం గైకొని కౌముది పెద్దపరిచారిక పాటలిక యనుదాని చేతికిచ్చి దీనిభద్రముగాఁ గాపాడుచు నిది చెప్పినట్లు గ్రహణమునాఁడు కౌముది కిమ్ము. మరతువుసుమీ? అని బోధింది మయ్యెరుకతకుఁ గానుకలిచ్చి యంపుమని మంజరికను నియమించినది.
మంజరికయు నేదియో బహుమాన మీయఁబోయిన నయ్యెరుకత యందుకొనక తల్లీ ! మీరు చల్ల గఁ బ్రసవమైన తరువాత మరల వత్తు. బిడ్డలనెత్తుకొని మంచి కానుక లిత్తురుగాక నిప్పుడేమియు నొల్ల నని చెప్పి వారినెల్ల దీవించుచు నెందేనిం బోయినది. అప్పుడది యేమియుంగై కొనమి దానిమాటలయందు వారికెల్ల నెక్కుడు నమ్మకము కలిగినది. ధన మాసింపనివారిని భగవంతుఁడు మెచ్చుకొనుగాక.
గ్రహణ సమయంబునఁ బండుకొనుట గర్భిణీస్త్రీల కాచార్యముగా యున్నది. మరికొన్ని దినంబులకు వచ్చిన యపరాదదివసంబునఁబండు కొనక పూర్వమే కౌముది జ్ఞాపక ముంచుకొని నాఁటి యెరుకసాని యిచ్చిన మందిమ్మని న్యా నంత, పటిక లమూవేరునం దేడెియా విశేషము సున్నదనే. శలంచి గధ్భవట న దాని రాముల మరగం ఓసి పుచ్చుకొమ్మని చె మ్ గ నది కిన్చిన నడి. కౌముది యామందు?: డినసుదపుంలత." 114
వూదిటిల్ వొయు-షట దినిన వెంటనే కడుపుల మనవిని మటు నటు(