Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

దేవీ! నీవింత తొందరపడవలసిన పనిలేదు. వాండ్ర మాయవిద్య లిఁకనీపై వినియోగింపవు. వారామాట జెప్పుకొనుచుండ వింటిని. ఊరక నిన్ను బెదరింపవచ్చిరి. మాయింటనేయున్నారని యా తెరంగంతయు నుడివినది.

అప్పుడు కాంతి సేన కొంతధైర్యముఁ దెచ్చుకొని ఎట్టెట్టూ ? ఆ మాట నీవు స్పష్టముగా వింటివా? కానిమ్ము. ఈ మాత్ర మవకాశమున్నదిగదా? కాకున్న వాండ్ర ముందర లోకములు నిలుచునా? యని పలికి దానికిఁ గొన్ని మాటలు బోధించి యంపినది. ఆ దాది వారియొద్దకువచ్చి వినయముతో మనోహరులారా ? మీరు నన్నుఁ బుత్రిక వోలెలాలించుచుఁ దలపూవువాడకుండ నీయూరు తీసికొనివచ్చి బంధువులలో గలిపితిరి. మీ కెద్దియేని యుపకారము చేయవలయునని తలంపుగలిగినది. నేడంతఃపురమునకుఁబోయి వచ్చితిని. ఆమె పెండ్లియాడవలయునని యూరకఁగుతూహలపడు చున్నది. తగినవరుఁడు దొరకలేదు. వీర సేనుఁడనుకూలుఁడనియే యెంచినదికాని తనతో నాద్వీపము రమ్మనుటచే నంగీకరించినది కాదు. ఎట్టివారికిని బుట్టినింటిసిరియందభిలాష యుండక పోవదు. ఇప్పుడా రాజకుమారునే పెండ్లియాడెద వార్త నంపుమని నాతోఁ జెప్పినది. నాకు వేరొక బుద్ధి పుట్టుటచే నతనియందు దోషారోపణముఁ జేసితిని. మీకు గల మాయా బలపరాక్రమములు వానికిలేవు. మీ ఖ్యాతి యంతయు నా దీవియందున్నప్పుడు విన్నాను. మిమ్మే పెండ్లియాడుమని చెప్పఁ దలచు కొన్నాను. దీనికి మీ యభిప్రాయమేమని యడిగిన నాదస్యులు సంతసించుచు నిట్లనిరి.

ఇంతీ! కాంతిసేన పెండ్లియాడెదననిచెప్పి‌ మగవారినిఁ బెక్కండ్ర వంచించినదట కాదా? ఆమాట నమ్మవద్దని మా రాజపుత్రుడు పలుమారు నాతో జెప్పి యుండెను. నీ మాటలు సూడ వేరొక తెరుఁగుగానున్నవి. అవును ఆఁడుది యెన్ని నాళ్ళు పెండ్లి యాడక బిగబట్టుకొని యుండగలదు. నీ యిష్టము. వంచనగాక యదార్దముగా నీకట్టి యభిప్రాయమున్న సంతోషమేకాదా యని పలికిన నక్కలికి యిట్లనియె.

అన్నలారా! ఆ రాజపుత్రుఁడు మీతో నట్లేమిటికిఁ జెప్పెనో గ్రహించుకొనరాదా ? తాను వలచియున్నవాఁడు. మీ పౌరుషమునకు మెచ్చికొని యమ్మచ్చకంటి మిమ్ము వరించిన మీరు పెండ్లియాడి పోదురేమో యని యట్టి వ్యూహము బన్నెను. మంచి వస్తువు యందెవ్వరికిష్ట ముండదు? ఆమెకు వివాహమునందలి మిక్కిలి వేడుకగా నున్నది. కనుక నింత చెప్పవలసి వచ్చినది. రేపు పోయి మాట్లాడివచ్చెద. మాట లేమిటికి? నిశ్చయమే యని తలంచుడు. అని చెప్పి వారి సంతోష వారిధిలో ముంచినది.

అది మొదలు వాండ్రు దానితో నీవుపోయి వచ్చితివా? పెండ్లి నిశ్చయించితివా? రాజపుత్రిక యేమన్నది? అని ముచ్చటించని గడియలేదు. ఆ దాదియు నిదిగో యదిగోయని నాలుగుదినములు గడిపి యొకనాఁడు టక్కరితో రహస్యముగా నిట్లనియె.

టక్కరీ? రాజపుత్రికతో మీ మాట సెప్పితిని. ఇరువురను నెట్లు పెండ్లి