(24)
టక్కరిటమారీ కథ
185
అయ్యో ? మన రాజపుత్రుని యభిలాష తీరినది కాదు ఈ మచ్చకంటి చచ్చినది. దీనిం దీసికొనిపోయి యతని ముందరఁ బెట్టెదమా? అని యాలోచించుచుండఁ గేసరిణివచ్చి కన్నీరుఁగార్చుచు అయ్యా ! మరణాంతరములు వైరములని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ చిన్నది మృతినొందినది. శత్రువుల యభీష్టములు తీరినవి. ఇక నీ శవముపైఁ గోప మేమిటికి? మా కిచ్చివేయుఁడు. దహనాది సంస్కారములు చేసికొందుమని వారికి జాలి పొడమునట్లు ప్రార్దించినది. అప్పుడు వాండ్రు వితర్కించి తీసికొనిపొండు. ఈ శవముతో మాకుఁ బనిలేదు అక్కడికిఁ దీసికొని పోయితిమేని కుళ్ళిపోఁగలదు అని పలుకుచు నా శవము నందువిడిచి దీనవదనులై సముద్రముదాటి వీరసేను నొద్దకరిగి శంతనాదులువిన రాజపుత్రా ! ఆ కాంతిసేన పాపము మారాయిడికోడి దారిలోఁ జచ్చినది సుమీ అని జరిగిన కథయంతయుం జెప్పిరి.
అప్పుడు శంతనుఁడు పక్కున నవ్వుచు రాజపుత్రా ! నేను జెప్పలేదా ? అప్పడతిని జయించువాఁడు పుడమిలో లేఁడు. అది పరకాయ ప్రవేశ విద్య నేర్చినదగుటఁ దనప్రాణ మేశరీరములోనో ప్రవేశింపఁజేసి చచ్చినట్లు కనంబడినది. ఆ మర్మము మీరెఱుఁగక శరీరము వారికిచ్చివచ్చితిఁ కేసరిణి దీనికంటె మాయలమారి ఈపాటికి వీటి కఱిగియమ్మగువ యధాప్రకారము రాజ్యమేలు కొనుచుండును. అనినంత.
ఆ మాట విని వాండ్రు అయ్యో ? ఆ కపటము మాకేమి తెలియును. నిజముగాఁ జచ్చినదేయని తలంచితిమి. మీరు రమ్మనిన రారు. మేమేమి చేయుదుము ? రెండు తేపలకంటె మామాయ యొకరిపై బ్రయోగింపరాదు. ఆ రాజపుత్రికపై మామాయ యిఁక వ్యాపింపదు. మేము పోఁజాలము. మాకనుజ్ఞ యిండని వాండ్రు రాజపుత్రుని కోరికొనిరి. రాజపుత్రుఁడు మిక్కిలి పరితపించుచు అన్నన్నా !మీయట్టి దిట్టలు నాకు బాసటలు జేసినను నా కాంతిసేనను బరిభవింపలేక పోయితిని గదా ? మీ పేరు వినినంత నా కాంత భీతిల్లకమానదు. మొదట మీరు తీసికొనివచ్చిన పరిచారికతో మాట్లాడితిని. దాని నవ్వీడుఁ జేర్చితిమేని మనకు సహాయముఁ జేయుదునని యనేక ప్రమాణికములు చేయుచున్నది. దాని వెంటఁ బెట్టుకొని పోవుఁడు. దానివలన నెట్టొగుట్టుఁ దెలిసికొని యారాచపట్టిం దీసికొని రండు. ఈ మాత్రముపకారముఁజేయక తీరదని బలవంతపరచిన వాండ్రెట్టకేని సమ్మతించి, యాదాదితోఁగూడ మరల నావీటి కఱిగి దాని యింటిలోనే నివసించిరి.
అమ్మరునాఁడది రాజపుత్రియొద్ద కరిగి నమస్కరించుచు టక్కరిటమారీలు మరల యాపురమున కరుదెంచిరి. వారితో నేనువచ్చితినని చెప్పినతోడనే కాంతిసేన
అము సంసల తటతడు గొట్టకొనము. ఆము యటంపొటు జాచి యి+దొద 5
“అవపనిలల లితిఆంంటీి, ఆటమ్ సింటంంంంనో