168
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
అయ్యగారు నాతో నా మాట నిన్ననే చెప్పిరి. వ్యాధి వచ్చినప్పుడు మొన్న తన కూఁతును బ్రాహ్మణునకుఁ బెండ్లి చేయుదునని మ్రొక్కుకొనె నఁట సగము రాజ్య మతనికిచ్చునఁట. అని యత్తె ఱం గెరింగించెను.
అప్పుడు రాజపత్ని విహ్వలమతియై యా బ్రాహ్మణపుత్రులు కావించు కపటకృత్యము లన్నియుఁ దనకూఁతు కాంతిసేనం బిలిచి యెరింగించినది. కాంతి సేన కడు చక్కనిది. విద్యావతి బుద్ధిమతి ఇంచుకయు విచారింపక ధైర్యము విడువక అమ్మా! ఉపాయంబున నెట్టి యపాయంబు నైనను దప్పించుకొనవచ్చును ఇందుకు బుద్ధిమతిక కధయే నిదర్శనము.
బుద్ధిమతిక కథ
వినుము. తొల్లి బుద్దిమతిక యను బ్రాహ్మణ స్త్రీ యిరువురు పిల్లలతో భర్తతో బండి యెక్కి యొక యరణ్యమార్గంబున నఱుగుచుండెను. అందొకచోట నెద్దియోసన గ్రహించి బండి ఎద్దులు రెండును త్రాళ్ళు ద్రెంచుకొని రివ్వున పారిపోయినవి. వానింబట్టుకొనుటకు బండివాడును భర్తయు నరిగిరి. అప్పుడు బుద్దిమతిక చింతింపుచుఁ బిల్లల బండిదింపి తొడలపై నిడుకొని యొక చెట్టుకింద గూర్చుండి భర్తరాక నరయుచుండెను.
అప్పు డప్పొంతనున్న పొదరింటిలో నుండి యొకపులి యక్కలికిం జూచి యాహా! ఆహారము నేడు దైవము నోటికందిచ్చెంగదా ? మనుష్యమాసంముఁదిని పెద్దకాలమైనది అని యుబ్బుచు అన్నన్నా యిన్నెలతుఁక కెన్ని గుండెలున్నవియోకదా? నిర్భయముగావచ్చి నాపొదదాపుననే కూర్చున్నది ఇందులకే యేని కారణమున్నదనియా? తొందరపడి మీదకురుకరాదు. కొంత యోచనచేయవలయును అయ్యో? కార్యాకార్య విధిజ్ఞుండు నామంత్రి జంబుకరాజు సమయమునకు సమక్షమున లేకపోయెంగదా ? అతనితో నీ తెఱం గెరింగింతునా ? పోని అంతయేల వచ్చినది జఠరాగ్ని రక్తమాంసములఁ బీల్చుచున్నది. దీనిం గమచిపట్టి భుజెందఁగాక యని నిశ్చయించి కన్నులు నిప్పులు తాలం దోకనాడించి నేలం గొట్టుచుఁ దత్క----------- గురిజూచుచు నాలుక యప్పగించి యుఱుకబోవు సమయంబున బుద్దిమతిక యాశార్దూలమును జూచినది.
అప్పు డదరిపడి చెదరిన హృదయముఁ గుదురుపరచుకొనుచు నమ్మదవతి తమ్ము మృత్యుముఖంబునం బడినవారిగాఁ దలంచియు నొక యుపాయమాలోచించి నిదురించుచున్న పిల్లల నిద్దరం గిల్లినది. నాశిశువులు కేవురమని రోదనము సేయం దొడంగిరి. వారిం జోకొట్టుచు బిడ్డలారా ! నేనేమి సేయుదును, ఏమియుం దినక --- నిత్యము పులిమాంసముం దెమ్మని యేడ్చుచుందురు. అందులకేకద్స నేనీ యడవికి వచ్చితిని. యెందును బులులు కనంబడకున్నవి. ఒక పులిదొరికినేని జంపి యిరువురకుం