Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంతనుని కథ

167

కరభుని యింద్రజాల ప్రభావంబుఁ చూచినది మొదలు శంతనుని కావిద్య సంగ్రహింపవలయునని సంకల్పము కలిగియున్నది ఆమాట విననతోడనే శంతనుం డెంతేని సంతసించుచు మిత్రమా! మన కకారణముగా నిరుపమానమైన మైత్రి కలసినది గదా ! నీకుఁ దప్పక కాంతిసేనం బెండ్లిసేసెద. నీ జాలము నా కుపదేశింపుమని యడిగెను. అనినం గరభుఁడు మిత్రమా ! రాజపుత్రికను నా కిచ్చుటకు నిచ్చయమైనతోడనే నామంత్రము నీ కుపదేశించెద నట్టి ప్రయత్నము సత్వరముఁగాఁ జేయుమని వానిం దొందరఁ బెట్టుటయు నతం డట్టి యత్నము గావింపుమనెను.

రాజు సేయు కృత్యములవలన మంత్రులకును బ్రజలకును నసూయ వృద్దిఁ బొందజొచ్చినది. రహస్యముగా సభలుచేసి యతనిమ్ గూర్చి వితర్కించుచుండిరి. రాజున కాంతరంగిక హితుండు శంతనుం డొక్క.డే. ఒకనాఁడు శంతనుండు రాజుతో రహస్యముగా దేవా! నీ కీ యుద్యానవనము పగలు కనంబడలేదని మంత్రు లెఱింగిరి కదా ! నీవు పరకాయ ప్రవేశము చేసితివని జెప్పుకొనుచున్నారు. ఆ మాట సత్యమేని నాతోఁ జెప్పుము. ప్రతీకార మాలోచించెదనని యుక్తి యుక్తముగా నడుగుటయు లఘుమతియగు నతఁడు దాపునకుఁ బిలిచి చెవిలో యదార్థమేయని చెప్పుకొనియెను. అతండా మాటవిని అయ్యో! నా కింతకు ముందైనను జెప్పితివికావేమి? మంత్రుల కనుమానముఁ గలగకుండఁ జేసియుందును గదా. పోనిమ్ము. ఇప్పుడు మిగిలిన దేమియును లేదు. ఇఁకముందు నేను చెప్పినట్లు చేయుచుండుము. అని యొప్పించెను.

అది మొదలు జనపతి శంతనుండు చెప్పినట్లు జేయుచుండెను. మఱి యొకనాడు శంతనుఁడు రాజుంచూచి దేవా? కాంతిసేనకు వివాహము చేయవలసి యున్నది. వెనుకటిరాజు కొంత ప్రయత్నముఁ జేయుచు మృతినొందెను. మన మిప్పుడా చిన్న దానిని సామాన్యుని కిచ్చి వివాహాముఁ జేయుదము. అధికుండైనచో మన మర్మములన్నియును భేదించి రాజ్యము -------చేసికొనఁగలడు పెండ్లి‌కొడుకుపేరు పిమ్మటఁ దెలియపరుచుదము అని యేమేమో బోధంచుటయు నతం డిట్లుఁ గావించెను.

రాజపత్ని శంతనుం బిలిపించి మీ రాజు కూతునకు వివాహ సన్నాహముఁ గావింపుచున్నాఁడట పెండ్లిముహూర్త ము దగ్గిరయున్నదఁట. వరుం డెవ్వడో నీకుఁ దెలియునా ? అని యడిగిన నాకు దెలియదు. తెలిసికొని చెప్పెదనని చెప్పి యప్పటికిఁ బోయి మఱిరెండు దివసంబు లరిగిన వెనుక మరల రాజపత్నిం జూడ వచ్చెను.

ఆమె వానింజూచి శంతనా ! కాంతిసేనను గరభునకే యిప్పించుటకుఁ బ్రయత్నము సేయుచున్నా వటగాదా? నాకుఁ దెలియనిచ్చితివి కావేమి? నేను మాత్రము సమ్మతింపకఁ బోవుదునా ? అని యడిగిన నతండు చిత్తము చిత్తము