శంతనుని కథ
165
శంతనుం డతని నా మేడలోనికిం దీసికొనికోయెను. ఆ చిన్నదియందొకగదిలో హంసతూలికా తల్పంబునం బండుకొనియున్నది. ఆ చిగురుబోణిం జూచి రాజు మరల మూర్చపోవుచుండ వీపు చరచుచు శంతనుడు దేవా ! నీవిట్లు మోహ మందెద వేమిటికి? నీ మతి చాంచల్య మెరింగెనేని యా కురంగనయన యనుమోదింపదు. అని పలికి ధైర్యము గరపెను. అంతలో నత్తలోదరిలేచి వినయముతో నొక పుష్పమాలికఁదెచ్చి యా యొడయుని మెడలో వైచినది.
అప్పు డతండది రంభయనియు నా పూవుఁదోట స్వర్గమనియు దలంచుచు నే మాటయనిన నేమినేరమో యని వెఱచుచు నేమియు మాట్లాడక రెప్ప వేయక నయ్యెల నాగసోయగము నిలువంబడి చూచుచుండెను. మరియు నా చిన్నది యనేక శృంగార శేష్టలు వెల్లడించుచుండ నా నృపతి మోహవివశుండై నేల కొరిగెను. అంతలో నింద్రజాలము ముగిసినది. శంతనుఁడానరపతి నంతఃపురమునకు దీసికొని పోయెను.
ఆరీతి పదిదినములజ్జనపతి కా వింతఁ జూపుచు శంతనుండు మరల నింటికిఁ దీసుకొని వచ్చుచుండెను. ఆ మాయావతి యా రాజుకొకనాడు తాంబూల మిచ్చుచు నొకనాఁడు గంధముఁ బూయుచు నొకనాఁడు సంగీతముఁ బాడుచు మోహ సముద్రములో ముంచి తేల్చుచుండెను.
ఒకనాడు రాజు మంత్రులం జీరి యీ వీటి కుత్తరమున నున్న యుద్యానవనము కావలివారలఁ గొందర రప్పింపుడని నియమించుటయు వారు నవ్వుచు దేవా! మనవీటి కాదెస నే తోటయు లేదుగదా. ఆ ప్రదేశమంతయు నెడారిగానున్నది. ఆకాశ కుసుమమువలె నందలి వనపాలకుల నెట్లు రప్పింపగలమని పలికిన నగుచు నతండు ఔరా ! నాతోఁ బరిహాసమాడెదరా ? నేసు ప్రతిదినము నత్తోటకుఁ పోవుచుండ లేదా ? నాతో రండు, చూపెదనని యప్పుడే బయలువెడలెను.
మంత్రులును వెఱగుపడుచు నతనితో నరిగిరి ఆ ప్రదేశమంతయు నెడారిగా నున్నది. చిన్న మొక్క_యైనను లేదు. తరువాత నా నగరము నలుమూలలు వెదకి చూచెనుగాని యా పూఁదోట కనంబడినదికాదు. అప్పుడు సిగ్గుపడుచు నొడయడు మరల నింటికివచ్చి తనకై వేచియున్న శంతనుం జూచి మిత్రమా! మనము చూచెడుతోట కనంబడినదికాదేమి ? మంత్రులతో బందెమువేసి యోడిపోయితిని గదా ? ఏ దిక్కుననున్నదో చెప్పుమని యడిగిన శంతనుం డిట్లనియె.
దేవా! దేవరహస్యమొక్కటి చెప్పుచున్నాను. మీరు పరకాయ ప్రవేశ విద్యాపైశారద్యంబున నృపకళేబరంబులోఁ బ్రవేశించిరని మంత్రులును బ్రజలును దలంచుచు మిమ్ము గొన్నివిషయములఁ బరీక్షించు చున్నారు. మనము చూచెడి యుద్యానవనము మీ తాతగారు దేవేంద్రుని మెప్పించి విశ్వకర్మచే నందు నిర్మించుకొనిరి. అది దివ్య ప్రభావ సంపన్నంబగుటఁ పగలందరకుం గనంబడదు. మీ వంశజులకు మాత్రము సర్వదా కనబడుచుండును. రాత్రులయం దందరికిఁ గనంబడును. అవ్వన