కామగ్రీవుని కథ
149
నాకు నైంద్రజాలికవిద్య నుపదేశింపుఁడు. అని కోరికొనిన నమ్మహాత్ముండు పదిదినములు నాచే శుశ్రూషఁ చేయించుకొని నాకా విద్య నుపదేశించెను.
అంతటితోఁ దృప్తిఁ బొందక నేనును నతని యనుమతిఁ బడసి దీర్ఘత మునియొద్ద కరిగి పదియేండ్ల జ్జడదారి నాశ్రయించితిని. అతండు ప్రసన్నుండై కామిత మేమని యడిగిన పరకాయప్రవేశవిద్య నుపదేశింపుమని కోరికొంటిని.
అతం డై హికము తుచ్చమనియుఁ బరముఁ గోరుకొనుమనియు నా కెంతయో బోధించెను. వారి హితబోధ యించకయు నా మనసు దూరినది కాదు. ఆ విద్యయే యుపదేశింపుఁడని వినయముతోఁ బ్రార్ధించితిని. నీ కర్మము. నే నేమి చేయువాఁడనని విసిగికొనుచు నయ్యోగివరుండా మంత్రమును నా కుపదేశించి యిట్లనియె.
కృపణాత్మా ! సంసారసక్తుండవై చాలకష్టములు పడి యీ రెండు విద్యల సంపాదించుకొంటివి. నీ కిప్పుడు పరువము గరించినది. సుఖ మెన్నఁడు పడుదువో తెలియదుఁ ఈ విద్యలు నీకు దంతములున్నంతసేపే ప్రసాదించును. ఒక్క పన్నూడినను బ్రసన్నములు కావు. వేగఁబోయి కామితముఁ దీర్చుకొనుము. అని యుపదేశించెను.
అప్పుడు ప్రహర్షసాగరమున మునుఁగుచు వారివలన నా మంత్రమును వడిసి యా హిమాలయపర్వతము లన్నియు దాటి మరలఁ గాశీపురంబున కరుదెంచితిని. నా జాల మా పట్టణములోఁబన్ని ప్రజల రంజించు తలంపుతో నొకనాఁడు గంగానదికి స్నా నార్థమై యరిగితిని. గంగాతీరమంతయుఁ బృధుశిలా నిర్మితములైన సోపానపంక్తులచే నొప్పుచున్నది. నేనా మెట్లు దిగునప్పుడు మేను తూలి కాలుజారి రాళ్లపైఁ బడితిని. మోము తాకి రక్తము స్రవింప నా పన్నొకటియూడి నేలపైఁ పడినది. నేనా పంటినిఁ జూచుకొని గండెలు బాదికొనుచు గోలుగోలున నేడ్వఁ దొడంగితిని. తైర్ధికుల పెక్కండ్రు వచ్చి నా గాయమునకు మందువైచి రక్త ముఁ గారకుండఁ జేసిరి కాని నా యేడ్పు మానిపింపలేకపోయిరి.
వెర్రి పారుడా ! దంతభగ్నమున కిట్టు వగచుచున్నా వేమి ? నేడు కాకున్న రేపైన నిది యాడునదియే కదా? ప్రాయముమీరినఁవాడవు బాలుడవు కావు. ఊరుకొనుము. దంతము పారవేసి స్నానముఁజేయము. అరచేతం బట్టుకొని చూచుచు దాని విడువలే కుంటివేమి ? అని పలువురు పలుబలుకుల నిందింప నేమియు మాటాడక కష్టోపార్జితములగు నా విద్యల రెంటినిం దచలంచుకొనుచు అయ్యో? ఒక తేపయైన దత్ప్రభావము జూచితికానే ? కాసైనను వానివలన సంపాదింపలేక పోయితిని నే నెన్ని యో యూహలఁ బన్నుకొనియంటి నవి యన్నియుఁ దృటిలో వమ్మైపోయినవి. అని తలంచుకొనుచుఁ బెద్దయెలుంగున వాపోవుచుంటిని.
నన్ను పన్నూడిన విలపించుచున్నాడని జనులు వింతగాఁ జూడఁ