విచిత్రనాటకము కథ
141
సత్వ :- సరిసరి యిదియా? చాలుఁ జాలు. ఈ మాత్రమునకే ఇవి నిందాలాపములా యేమి?
కళా :- కావు నిరూపణాలాపములే.
శీల :- ఇఁక దాచనేల? మే మందరము నీకు బరిచారికలమై యుండ దలంచుకొంటిమి. ఉత్తమ బ్రాహ్మణ పుత్రుఁడవుగదా ?
సత్వ :- మీ వరపుఁడుతనము నేను భరింప నోపుదునా ?
కళా :- నీకంటె సత్వవంతుఁ డెవ్వఁడు ?
అని యీ రీతి ముచ్చటించుచుఁ గ్రమంబునఁ దమ హృదయాశయము వెల్లడించిరి. అతం డెరింగియు నెరుఁగనిఁవాడు బోలె వాండ్రం జిక్కులు పెట్టెను. శీలవతి విద్యాభాస్కరునిచే మెడలో మంగళసూత్రముఁ గట్టించుకొన్నదిగదా ? దాని కేమి చెప్పుదురని యడిగిన నయ్యింతి మంగళసూత్రము గట్టినప్పుడు వ్రేలడ్డు పెట్టుకొంటి. దానంజేసి దోషము బాసినదని శాస్త్రముఁ జూపినది. అప్పుడు సంతోషముతో నతండు వారిని బెండ్లి యాడుట కంగీకరించెను. అంతలోఁ దెల్లవారుటయు నా కేసరి మధ్యలావిద్వత్కేసరిగా రహస్యమంతయు నప్పుడు వినిపించి యతండు ప్రహర్ష ప్రవాహమున నీదులాడుచుండ దమ తండ్రుల నక్మడకుఁ దీసికొనిరమ్మని కొన్ని వచనంబు లుపదేశించి యంపిరి.
ఆ విద్వాంసుండు ధర్మపాలుని బస యడిగి తెలిసికొని యచ్చటికిం బోయెను. అంతకమున్న యజ్ఞదత్త ధనపాలు నృపాలకు లక్కడికి వచ్చికూర్చుండి రాత్రి జరిగిన నాటకకథను గురించి సత్యమా ? యసత్యమా ? అని వితర్కరించుచుండిరి. అంతలో విద్వత్కేసరి లోనికిం బోయెను. అతనింజూచి యజ్జదత్తుండు గురుతుపట్టి యోహో నా బాలసఖుఁడు విద్వత్కేసరి కాబోయి. ఎన్నినాళ్ళకుఁ గనుపించితివి. ఎందుండి వచ్చుచుంటివి? పిల్లలెందరు అని భావక ప్రశ్నఁ గావించుచు నుచిత పీఠోప విష్ణునిజేసి ధర్మపాలునితో నతని వృత్తాంత మెరింగించెను.
అప్పుడా కేనరియు ధర్మపాలాదుల నమస్కారము లందుకొని యాశీర్వదించుచుఁ దొల్లి కాశీపురంబున విద్యార్దులై యున్నప్పుడు తాను సిద్ధతీర్ధమునకుఁ పోవుటయు లోనగు వృత్తాంత మెరింగించి యా యజ్ఞదత్తుండు తన కూఁతుని నా కోడలిగాఁ జేతునని వాగ్దత్తముఁ జేసియున్నాడుఁ ఆ మాట చెల్లించుకొనసమయము వచ్చినది. నా కుమారుని దీసికొని వచ్చితిని. మీరుఁగూడా నచ్చఁజెప్పి పిల్ల నిప్పింపుడని యుక్తి యుక్తముగా వక్కాణించెను.
ఆ మాటవిని ధర్మపాలుండు కన్నీరు విడుచుచు అయ్యో ? వెఱ్ఱిపారుఁడా? నీ వక్కథ నెరుంగక నిట్ల డుగుచున్నావు. ఈయన కూఁతురు నదిలోఁబడి కడతేరినది. అందులకే మే మందరము నిట్లు విరక్తిఁజెంది తిరుగుచున్నారమని నుడువ నవ్వుచు డీలా ? మీరుకూడా తబ్బిబ్బు పడుచుంటిరేల? ఇంతకు ముందుకాదా వీని