138
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
జేయఁబూనెను. కానిమ్ము మననోము లిప్పటికిఁ బండినవిగదా యని తలంచుచు నప్పుడే యొక పరిచారకుని నాటకశాలయొద్ద కరిగి యా కృతవర్మ యెందుండునో తెలిసికొని రమ్మని పంపిరి.
వాఁడు పోయి వచ్చి అయ్యారే! నాటకసంఘమువారు. మహా రాజులకన్న నెక్కుడు వైభవముతో నున్నారు. మాబోటివారితో మాటాడుదురా? నామాట వినిపించుకొనినవాఁడే లేడని చెప్పెను. పోనిమ్ము. ఈ రాత్రి నాటకమునకుఁ బోయి యా యాటఁ జూచి పిమ్మట నతని విమర్శింతు మని పలికిరి. సత్వవంతుండు మీ చరిత్రము రామాయణమువలెఁ బ్రసిద్ధికెక్కినదని పరిహాస మాడుచుండఁ గథానాయకుఁడవు నీవేకాదా? నీకుం బ్రఖ్యాతి రాగలదని యుత్తరము చెప్పినది.
అట్లు వా రా పవలెల్లఁ బరహాసోక్తులతోఁ గడపి రాత్రిపడినతోడనే విద్వత్కేసరి తోడురా దివ్యమాల్యాంబరాను లేపనాదుల ధరించి నలువురు గలసి యానాటకశాలకుఁ బోయిరి. దేశాధిపతులును సామంతులును గూర్చుండఁ దగిన పీఠములు శ్రేణిగా నాశాలయం దగ్రభాగమున నమరింపఁబడి యున్నవి. వీ రేగురును దొలుతనే పోయి యాపీఠములనే యధిష్టించిరి. తరువాతఁ గ్రమంబునఁ బెక్కుండ్రు మహరాజులు వచ్చిరి. లన్నియు సరిపోవమింజేసి కొందరు రెండవశ్రేణి గద్దియలం గూర్చుండిరి. పౌరు లనేకులు వచ్చి యా యా భాగంబులన్నియు నిండించిరి. పెక్కు లేల నాటకశాల యంతయు జనులచే నిండింపబడి యిసుఁగ జల్లిన రాలకకుండ దట్టమై యుండెను.
అప్పుడు నియమింపబడిన కాలమునకే నాటకము ప్రారంభింపఁబడెను. నాందియైన తరువాత సూత్రధారుండు తెర వెలుపలికి వచ్చి చెప్పవలసిన మాటలఁ జెప్పి లోపలికిఁ బోయెను. అంతలో శీల కళా విద్యావంతుల వేషములు ప్రవేశించినవి. కృతవర్మ విద్యావతివేషము వైచికొనినను వారు ధరించు నగలును బట్ట-------- మాల్యాను లేపనాదులచే యా భూమికలు దాల్చుటచే నచ్చముగా వారి పోలికనే యొప్పు చుండెను.
అందుఁ గూర్చున్న శీల కళా రూపవతు లాభూమికలఁ జూచి తమ ప్రతిబింబములాయని విస్మయపడఁ జొచ్చిరి. అవేషములఁ జూచి యాసభలోఁ గొందరు పీఠములనుండిలేచి నిలువంబడి హా! పుత్రీ! శీలవతీ! హా! కళావతీ! హా! విద్యావతీ! హా! యని యార్తనాదములు కావించుటయు రక్షకభటు లాకోలాహలము వారించుచు వారినెల్ల మరలఁ బీఠములఁ గూర్చుండఁ జేసిరి.
పిమ్మట నాభూమికల సంభాషణములు సభ్యులకుఁ మిక్కిలి విస్మయముఁ గలుగఁ జేసినవి. చరిత్రాంశములనెల్ల మనోహరముగా బ్రదర్శించిరి. నాటకాంతరమున మంగళగీతములఁ బాడినతోడనే పీఠమునుండి యొకఁడు లేచి నిలువంబడి యిట్లనియె.
అయ్యా! యీనాటకము రచించిన కృతవర్మ యీ కధాకల్పన మెట్లుఁ
.