పుట:కాశీమజిలీకథలు-06.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమల కథ

107

అందు మాయిచ్చు నాతిధ్యమంది మమ్మానంధింపఁ జేయవలయునని యెంతయో వినయ విశ్వాసములతోఁ బ్రార్థించిన నాలించి సంతసించుచు సత్వవంతుండందుల కనుమోదించెను. అని యెఱింగించువరకు వేళ యతిక్రమించినఁ గథ విరమించి పై మజిలీయం దిట్లని చెప్పందొండగెను.

డెబ్బది రెండవ మజిలీ.

కమలకథ

ప్రభావతీ పురంబున విశ్వేశ్వరునియాలయ మొకటికలదు. ఆ దేవళము నాలుగు దెసలను నొప్పుచున్న గోపురములు గోపురమునకు సోపానములోయన విరాజిల్లుచున్నవి. ప్రాకారమంటపాదుల యతిశయము వర్ణింపఁ బదిదినములు పట్టును. దాని గాశీక్షేత్రముగాఁజేయు తలంపుతో నాదేశపు రాజులలో నొకఁ డయ్యాలయాదులఁ గట్టించి యా లింగమునకు విశ్వేశ్వరుఁడను పేరు పెట్టెను. ఆ క్కో వెల యావరణములో గంగయను బేర నొక పెద్ద తటాకముఁద్రవ్వించెను అందలి జలంబు లగాధంబులై నిర్మలంబులై మధురంబులై యొప్పుచుండును కాశింగల తీర్థంబులును లింగంబులు నా యా చోటుల నా యలయాంగణములందు నిర్మింపఁబడి యున్నవి. అవి యట్లుండె వ్యాసమఠమను బేరుతో నొక మఠముఁ గట్టింపబడి యున్నది. సన్యాసులు, బైరాగులు, యోగులు, యోగినులు లోననుజ్ఞాన వాసనగల విరక్తులకొరకా మఠము గట్టింపఁబడినది. అట్టివారికి భోజన భాజన సత్కారములు సేయుటకై ప్రత్యేకము నందొక సత్రమును స్థాపించిరి. తనంబనియు యోగంబనియు హోమంబనియుఁ బేరులు పెట్టుకొని భార్యాపుత్రాదులఁ బోషించుకోలేక విరక్తులై పొట్టనిండఁ గాలక్షేపముఁ జేసికొను డాంబికు లందు బెక్కండ్రు గలరు. చౌర్యాది దుష్టక్రియలు గావించి రూపుమార గడ్డములు పెంచికొని యోగులవలె జపముసేయు వారు గొందరుందురు. మరియు -

సీ. ఒకమూలమ్రోలఁ బావకముంచికొని యర్ధ
              దృష్టి మాలికలను ద్రిప్పువారు
    ఒకవంక నూర్ద్వ ఔహుపులుగా యో
              గము ల్వెలయించి తపముఁ గావించువారు
    ఒకచెంత నిగమాంత యు క్తితత్వముల నం
              తేవాసితతికి బోధించువారు
    ఒకచక్కి గురుభక్తియుక్తిఁ బూజలు సేసి
              దేవతావళులఁ బూజించువారు