పుట:కాశీమజిలీకథలు-06.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(14)

సౌగంధిక కథ

105

మీఱేని కేమియు నుపద్రవము లేదు. నేనువచ్చి విజయముఁ గలుఁగఁ జేసెద. ఇందరితో మీ రాజునకు వైరమేమిటికిఁ గలిగినది. వారికేమి యపకారము గావించెనని యడుగ నాదూత లిట్లనియె.

సౌగంధికకథ

దేవా! వినుండు. మా పభువుగారికిఁ జిరకాలమునకు సౌగంధికయను పుత్రిక యుదయించినది సంతత తదీయ హాససల్లాప క్రీడావిశేషంబుల నిక్షేపములుగాఁ దలంచుచు నతండు ప్రాణపదముగా నమ్ముద్దులపట్టిం బెనుచుచుండెను. అప్పంకజాక్షి యౌవనమంకురించు సమయమున కంగనాజనదుస్సాధ్యమగు విద్యాసంపత్తి నవఘటించి దేశమునఁ బొగడ్త కెక్కినది. చదువుకొనిన యాఁడువాండ్రు పెద్దలకుఁ దప్పులు దిద్దుచుందురుగదా ? ఆ పూబోణి యౌవనారంభమందుఁ ద్రిజగన్మోహన సౌందర్యంబునఁ బొలుపొందుచుండుటయు మా రేఁడు వేడుకతో సుందరంబునం బేరుపొందిన రాజనందనులం గొందర నేరి వారి చిత్రఫలకముల నా యువతీ తిలకమునకుఁ జూపిన వారినెల్లఁ బరిహాస పూర్వకముగా నిరసించినది.

అట్లు పలుమారు జేయుటయు నా వసుమతీపతి విసిగి స్వయంవరముఁ జాటించెను. అ మ్మహోత్సవమునకు రాజపుత్రులు వేనవేలు చనుదెంచి సభాభవన మలంకరించిరి. అప్పుడు రాజుపుత్రిక సఖీపరిపృతయై పుష్పదామంబుఁ జేతంబూని దమయంతివలె నొప్పుచు నా సభాంతరాళమున కరుదెంచి రాజులనెల్లఁ గనుంగొనుచు నంతకుముందు దెలిసికొని వచ్చిన సఖీజనంబు వారివారి కులశీలనామ విద్యా బల పౌరుషాదుల నెరింగింపుచుండ నాలించుచుఁ బరీక్షించి తిరిగి తిరిగి చూచిచూచి యందెవ్వఁడు దానుఁ గోరదగిన వీరుఁడు లేడని నిరసించి తిరస్కార భావముతో నా సభా భవనము దాటి యవ్వలికిఁ బోయినది. అప్పుడే రాజపుత్రుల హృదయంబులఁ గోపానలం బుదయించి రవులుకొనఁ దొడంగినది. అయ్యువతీమణి యింటికిబోవునప్పు డొక యశోక పాదపముక్రింద నిలువబడి యా వింతఁ జూచుచున్న విప్రకుమారు నొకనిఁజూచి తలయూచుచుఁ గులశీలాదు లడుగక సఖులఁ జూడక నొడలెరుఁగక మోహవివశయై తనచేతనున్న పుష్పదామ మతని కంఠమునవైచి వరించినది. అంతకన్న నవివేక మెందైనం గలదా ? భర్తృదారిక యగుట నేమాట యనుటకుం గాదుకాని రాజపుత్రులకన్న నా చిన్నవా డేమిట నధికుండు? అప్పుడు పరిచారికలెల్ల వానిపైఁ బూవులు చల్లుచు నందలమెక్కించి యంతఃపురంబునకుఁ దీసికొనిపోయిరి. అతఁడానాడు లేచిన వేళ మంచిది. అంతకన్న వేరొకటిలేదు విమర్శింప తన మరకారుని కుమారుంట: సద్యార్థులు కాపురంచున్నాడట. నిప్పల్ల --ధరి సూరకంటింప చ ఏలికయు లజర్లు పుప్రకావాత్సల్యము పెంపగు నేమియు న