పుట:కాశీమజిలీకథలు-05.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మం — సంయమిచక్రవర్తి! జీవుడు ఘటాదికమువలెనే యనిర్వజ్ఞత్వము కలిగియుండుటచేత నీశ్వరభిన్ను డగుచున్నాడు. అనెడు నీ యనుమానముచేతనే భేదశ్రుతికి బాధకము రాలేదా! తర్కము నీవు చూచియుండినచో నం దీవిషయము నీకు దెలియను గదా!

శం - తర్కము నే నెఱుంగునది కాదు. నీ నుడివినబట్టి బ్రహ్మనిరూపితమగు భేదము పరమార్ధభూతమైనదియా లేక కల్పింపబడినదియా? బరమార్ధ భూతమ వంటివేని దృష్టాంతము లేదు. కాల్పనిక మంటివా? పరస్పరవ్యావహారికభేదము లేదన మేమును సమ్మతించితిమి. కావున సాధింపంబనిలేదు.

అని యిట్లు మృదువాక్యచాతుర్యంబున శాస్త్రదృష్టాంతములచే మండనమిశ్రప్రశ్నములనెల్ల ఖండింపుచు స్వమతము శిద్ధాంతపరచుచున్న శంకరయతిచంద్రుని పాండిత్యప్రకర్ష నరసి నిరుత్తరుండై యున్న ప్రాణేశ్వరు మెడలో నున్న పుష్పమాలిక వాడుటయు జూచి యుభయభారతి యచ్చెరువు నొందుచు వారిని భోజనమునకు లెండని నియోగించి భోజనానంతరమున నల్లన శంకరునికిట్లనియె.

ఆర్యా! శంకర! నీ వాదిశంకరుడ వగుట దెలిసికొంటిని. దుర్వాసశ్శాపదోషంబు వాసి భవదీయదయావిశేషంబున గృతార్ధురాలనైతి నిఁక సత్యలోకమున కరుగుదాననని పలుకుచు బ్రయాణోణ్ముఖి యగుటయు నామెను సైతము జయించి యద్వైతము స్థాపన జేయుతలంపుతో వనదుర్గామంత్రంబున నామె నరుగకుండ బంధించి యల్లన నిట్లనియె. దేవీ! నీవు లోకరక్షణార్ధమై యవతరించిన విరించిపత్నివని యెరుంగుదును. నేను భవదీయభక్తుండ కృపావీక్షణంబుల నీక్షించుము. మరి కొంతకాల మిందుండి పిమ్మట నరుగుము. లోకహితమగునని పలికి మండనపండితుని యభిప్రాయము దెలియు తాత్పర్యముతో నతని మొగము జూచెను. అయ్యతిప్రవరుని నిగమార్థనిర్ణయములగు వచనములచేత శాంతింపబడిన కోపము గలవాడైనను మండనుండు, సందియముదీరక వెండియు నతని కిట్లనియె.

ఆర్యా! నాకీ నూతనాపజయంబున నించుకయు విషాదము గలుగదు. కాని జైమినీవాక్యములం బరిభవించితినని విచారింపుచుంటి అమ్మహాత్ముం డాగతానాగతములం దెలిసిన సుకృతలోకోపకారపారీణుండు నిగమప్రవర్తనయం దధికృతుండైనవాఁడు. సకలకలానిపుణుం డత్తపోధనత్తమున కిట్టి వ్యర్ధసూత్రముల రచించు వ్యవసాయ మేటికి గలుగవలయును? అంత దెలియనివాడా యని సంశయముగా నున్నదని పలికిన విని నవ్వుచు శంకరు డిట్లనియె సౌమ్యా! జైమినియం దించుకయు నన్యాయము లేదు అత డెరుంగనివాఁడు కాఁడు. మనమే యనభిజ్ఞుల మగుటచేఁ దదభిప్రాయముఁ దెలిసికొనఁజాలకున్నాము. అనుటయు మండనుండిట్లనియెను. యతిసార్వభౌమా! పండితులకును దెలియఁబడని జైమినిముని యభిప్రాయము వేఱెద్దియో వక్కాణింపుము. నీనుడివి