పుట:కాశీమజిలీకథలు-05.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

65

నెఱింగితివి. అదియునుంగాక గోవింద శిష్యుండవైన నీ ముఖమునుండి దురుక్తిజాల మెట్లుగా వచ్చెడిని నీవు ప్రాకృతుఁడవు గావు. సకలార్థముల నెఱింగిన మహానుభావుండవు. బ్రహ్మచర్యము నుండియే సన్యసించి సూర్యుం డంధకారంబుపగిది విషయసుఖంబుఁ బరిభవించితివి. బహ్వర్దగర్భంబులు గూడ భావంబులు నగు మదీయ సూత్రములను వివరింపనీకుఁగాక యొరులకు శక్యమా! స్వభావముచేతనే తెలియశక్యముగాని యా సూత్రముల కర్థముల నెవ్వఁడెఱుంగును. సూత్రకర్తక్లేశము కన్న భాష్యకర్తకష్ట మెక్కడని దేవతలు చెప్పియున్నారు. మదీయభావంబుల నెఱింగి సాంఖ్యాది శాస్త్రములచే విపరీతమై యున్న వేదాంత మార్గమును జక్కఁబరచుటకు నపరశివుండవగు నీకుఁ గాక యొరులకు శక్యమా? సర్వజ్ఞా! మదీయ సూత్రజాలమున కింతకుఁబూర్వ మెందఱో పండితులెన్నియో వ్యాఖ్యానములు రచించి యున్నారు. ఒక్కటియైనను నీ భాష్యమువలె మదీయహృదయానుగుణ్యమై యుండలేదు. నీ వన్నిటికింజాలినవాఁడవు. గావున వేదాంత విద్యను బుడమియంతయు వ్యాపకము సేయుము. భేదవాదులగు విద్వాంసుల నోడింపుము. సానుబంధములగు గ్రంథముల రచింపుము. నీకు విజయ మగుంగాక నేను పోయి వచ్చెదనని పలుకుచున్న వ్యాసునకు వినయపూర్వకముగా శంకరుండిట్లనియె.

స్వామీ! నీ యనుగ్రహంబున భాష్యములఁబెక్కు రచియించితిని. శిష్యుల బఠింపఁజేసితిని కుమతవాదుల నోడించితిని. ఇక నాకుఁగర్తవ్యమేమి యున్నది? ముహూర్తమాత్రంబీ మణికర్ణికాక్షేత్రంబున వసియింపుఁడు. మీ మ్రోలను బ్రాణంబులువీడి కైవల్యంబు నొందెదను కాలంబు సమీపించియున్నది. ఆజ్ఞయిండని పలికిన విని వ్యాసభట్టారకుండొకింత చింతించి సౌమ్య! అట్లు కావింపవలదు. ప్రౌఢవిద్యాశాలులగు పండితులు గొందఱు పుడమియం దద్వైతవిద్యావిరోధకులై యున్నవారలు వారి నెల్లర జయించు నిమిత్తము కొంతకాల మీ పుడమియందు నీవుండవలయును. లేనిచోఁ దల్లి లేని పిల్లవాని యునికివలె మోక్షేచ్చ దుర్లభమగును.

యతివరేణ్యా! ప్రసన్న గంభీరార్థములతో నొప్పుచున్న భవత్ప్రణీతంబగు భాష్య ప్రబంధంబుఁ జూచుటవలనం గలిగిన యానందము నీకు వరమిమ్మని నన్నూరక ప్రేరేపించుచున్నయది. ఎనిమిది యేండ్లు యాయువు నీకు విధినిరూపితమై యుండఁ నీ బుద్ధిబలంబున మరియంతయాయువు సంపాదించుకొంటివి ఇటుపిమ్మట వెండియుం బదియాఱేఁడుల యాయు వీశ్వరాజ్ఞచేఁ గలుగునట్లు నీకు వరమిచ్చితిని నీరచించిన భాష్యం బాచంద్రతారకంబై వసుధరఁ దిరంబై యుండుగాక. నీవీ పదియాఱేఁడులలో దేశాటనము చేయుచు. విరోధిగర్వాంకురంబులు నిర్మూలింప జాకరూకంబు