పుట:కాశీమజిలీకథలు-05.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x

చ. గరసగతింబురాణ కవి సన్నుతుఁడైనను భాష్యకర్త శం
    కరుఁడుమదల్పవాక్యకృతి గౌరవబుద్ధి ననుగ్రహింపఁడే
    నిరతము దుగ్ధవార్ధి శయనించెడు విష్ణుఁడు ప్రీతిగోపికా
    తరుణులొసంగు దుగ్ధముల దక్కు వనాక పరిగ్రహింపఁడే.

శా. ప్రారంభించి కడంక శంకరగుణ వ్రాతంబువర్ణింపగా
    ధీరుల్ పెక్కురు శ్లోకపాదమును బూర్తింజేయలేరైరహా
    యేరీతిన్ రచియింతుదత్కథలనం చెంతేనిలజ్జింపక
    బ్జారింబట్టగరంబు లెత్తుగతి నా యత్నంబు చిత్రంబగున్.

శా. ఐనన్మూగలనైన వక్తలుగ జేయంజాలి దగ్ధార్ణవా
    నూనోర్మిప్రకరోల్లసత్కణరుచి వ్యూహంబులన్ జేరుచున్
    జానై యొప్పెడుదేశికోత్త మకటాక్షంబుల్ కరంబిప్డు నా
    పైనిండారంగ నొప్పుచున్నవి యలభ్యంబెద్దినాకింకిటన్.

చ. పరమహితోపదేశమునఁ బామరకోటిఁదరింప జేయఁగా
    ధరనుదయించినట్టి పరతత్వవిదుండు మహేశ్వరుండు శం
    కరగురుసచ్చరిత్రము ప్రకాశముగా రచియించినేనెద
    న్మురియుట యబ్బురంబె పరిపూతుఁడనంచుజనంబులెన్నగన్.

చ. శుభకరవారిజాసన వృక్షితిభృచ్చకోల్లస
    చ్ఛుభకరశూన్యనందగిరి శుభ్రమయూఖశకాధి కోల్లస
    ద్విభవసమాసుమార్గసిత విశ్రుతమౌ విదియంజనించితిన్
    ద్రిభువనవంద్య వేదజన నీ కరుణావిలసద్విలోకన
    ప్రభవకవిత్వవైభవుఁడ భవ్యకవీంద్రవచో విధేయుడన్.

నేను జన్మసాఫల్యంబు శ్రీశంకరాచార్య చరిత్రము రచింప నెంచితి తత్కథాక్రమంబెట్టిదనిన, మణిసిద్ధయతీంద్రుఁడు గోపాలునితోఁగూడ నలువది యెనిమిదవ మజిలీనెలవు జేరి యందుఁ గాల్య కరణీయంబుల దీర్చుకొని తన్ను జూడవచ్చిన చిదానందయోగితోఁ బెద్దతడ వద్వైతజ్ఞానమును గురించి ముచ్చటించెను. వారి ప్రసంగ మంతయు దాపున గూర్చుండి గోపాలుండు వినుచుండెను. తత్ప్రసంగానంతరమున మణిసిద్ధుండు శిష్యుని మొగముజూచి నవ్వుచు, వత్సా! మా ప్రసంగము నీకేమయిన నర్ధమయినదా? కడుశ్రద్ధగా వినుచుంటివని యడిగిన గోపాలుండు, స్వామీ! నా