పుట:కాశీమజిలీకథలు-05.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

49

క. గోవింద యతీంద్ర ! భవ
   త్సేవానిరతులము మేమధిక భిన్నమనీ
   షావివశులమైతిమిగదె
   కావవెమాయా ర్తివిని ప్రకాశగుణాణ్యా.

సీ. అటుకలఁద్రాళ్ళ వ్రేలాడగట్టినసుపు
           స్తకములువరదఁ గొట్టికొనిపోయె
    సుడిగుండములు పెట్టి కడిదిగుండములయ్యె
           నగ్నికుండముల గేహంబులెల్ల
    నరణులతోస్రుక్ర్సు రాదిపాప్రలునీటఁ
           దేలివారిధిఁజేరెఁ దెట్టెతోడఁ
    బెనురాలతోడఁ గట్టిసమేటియిండ్లతో
          గోడలెల్లను నీటఁ గూలిపడియె.

గీ. పాతరలుమున్గె గాదుల పసయడంగె
    ధ్యానములువోయెఁ జేలు గుండంబులయ్యె
    నరుతనిడుకొని మా యగ్రహారములను
    దాచికొన్నది యీ నర్మదాస్రవంతి.

గీ. చెట్టుచేమలపైఁ బ్రాకి చెదరిజనులు
   బ్రాణములఁ గాచికొనుచుండి రనఘ? యిప్పు
   డీ యుపద్రవముడిపి రక్షింపుమయ్య
   శరణుఁజొచ్చితిమయ్య మీ చరణయుగము.

గోవిందయతి యప్పుడు సమాధిబద్ధచిత్తుండై బాహ్యేంద్రియ వ్యాపార ముడిగి యున్నవాఁడు గావున వారిమ్రోల నాలింపడయ్యెను. తచ్చుశ్రూషాపరాయణుండై యున్న శంకరుఁ డయ్యర్తధ్వని నాలించి యగ్గుహాంతరమునుండి యరుదెంచి గుహా ముఖమున వారిం గాంచి మీరెవ్వరు? ఏమిటికి మొర పెట్టుచున్న వారని యడిగిన నతండు బాలుండు వినియు నేమిచేయఁగలవాఁడని నిరసించుచుఁ బ్రత్యుత్తర మీయ కప్పారులు నలుమూలలకుఁ బరువఁదొడంగిరి. అందుఁ గొందరు బుద్ధిమంతులు శంకరునిమాటఁ బాటించి, ఆర్యా! నీవు ప్రాయంబున నల్పుండవయ్యును దేజంబుఁజూడ నధికుండువలెఁ గనంబడుచున్నాఁడవు. వినుమా నడుమ గురిసిన ప్రకర్షవర్షప్రచారము మీరెరింగియే యుందురు. పర్వతగుహావాసులగుటఁ దద్భాధ మీకెరుక పడక పోవ