పుట:కాశీమజిలీకథలు-05.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

43

అని పలికి శంకరుండు కన్నీరు గార్చుచున్న తల్లి రెండుచేతులం బట్టికొని జ్ఞాతుల కప్పగించెను. అట్టి సమయంబున నాయగ్రహారపు బ్రాహ్మణులెల్ల నచ్చోటి కరుదెంచి యామె ధైన్యము జూచి విచారింపుచు నతనివైరాగ్యమున కచ్చెరువందఁ జొచ్చిరి. అంతలో శంకరా! నీవు దూరముననుండిన పూర్ణానదిని దల్లి యిడుమలు వాయుటకై యగ్రహారము దాపునకుం దెచ్బితివి తత్తరంగముల రాయిడిచే గోపాల స్వామి యాలయము బీటలువారినది. యాస్వామిని మరియొకచోట స్థాపించి పొమ్ము. అనుమాట యొకటి వినంబడుటయు నావచన మెవ్వరు పలికినది నిశ్చయింపలేక యెల్లరు విస్మయమంది నలుమూలలు చూడఁదొడంగిరి. అది భగవదుక్తిగాఁ దలంచి శంకరుం డప్పుడేపోయి యాగుడి పగిలియుండుటఁ జూచి వెరఁగుఁజెందుచు నాస్వామిని భుజములతో మెల్లగానెత్తి మరియొక తావున స్థాపించి యాలయ మంటపప్రాకారాదులఁ గట్టింప నియమించి యనంతరమున.

శంకరుఁడు సన్యాసాశ్రమ స్వీకారమునకై గోవిందయతియొద్ద కరుగుట

గీ. తల్లిపాదాబ్జములకు వందన మొనర్చి
   ఫాలమున గేలు ఘటియించి బంధువులకు
   వారిదీవెనలంది యిల్వడలెనాతఁ డ
   బ్ధిఁబడు నొక్కకల మెక్కి నట్టి యతఁడు.

మ. చతురాస్యాదులు మున్ను దుర్మదమనోజప్రౌఢిమై చాల మో
     హితులై రేనును మోహినీకుచకచాన్వీక్షారతిం బొల్చి వీ
     డితి ధైర్యంబతిదుష్టుఁ డీస్మరుఁడు దండింపన్ భరంబంచు న
     య్యతియైకామకృతార్తివార్తయె వినం డయ్యెన్ శివుండయ్యెడన్.

క. సురగరుడోరగవిద్యా
   ధరగంధర్వాది దేవతలనైన వశం
   కరులుగఁ జేసెడు మన్మథుఁ
   బరిభవమొందించెయతి ప్రభావమలతియె.

సీ. శాంతిమానసము వశంబుఁ జేసికొనంగ
            గమనాదిక క్రియ ల్గట్టె దాంతి
    యుపరతివిషయాంత రోత్సుకత్వముమూన్పె
            క్షాంతిమృదుత్వంబుఁ జక్కఁజేసె