పుట:కాశీమజిలీకథలు-05.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

195


గౌడపాదముని దర్శనము

అట్లు రోగవిముక్తుండై శంకరాచార్యు లొకనాఁడు గంగానదీ సైకతంబునఁ గూర్చుండి నిలకణార్ద్రవాత పోతంబులు మేనికి హాయి సేయ నాత్మధ్యానము సేయుచున్న సమయంబున.

మ. శుకశిష్యుండు తపోధనుండు సకల శ్రుత్యర్థపారంగతుం
     డకలంకాత్ముఁడు గౌడపాదముని హస్తాగ్రప్రదీప్తాక్ష మా
     లికసోణాంబుజమమన్ భ్రమన్ భ్రమరముల్వేష్టించిరాద్రిప్పుచున్
     బ్రకటప్రజ్ఞయతీశ్వరుంగ నెడు తాత్పర్యంబుదీపింపఁగన్.

అచ్చోటికి విచ్చేయుటయుంగాంచి హర్షపులకాంకితశరీరుండై యాచార్యుండు శ్రద్ధాభక్తీపూర్వకముగాలేచి తదీయ పాదవంకేరుహంబులపై వ్రాలి కన్నుల కద్దికొనుచు యధావిధి నర్చించి నిటలతట ఘటితాంజలిపుటుండై యెదుర నిలువబడుటయు.

శా. క్షీరాంభోనిధివీచికానిచయనా చివ్యాంచితా పాంగ నీ
    క్షారాశిన్ యతిశేఖరుం దడువుచు న్సౌహార్ధ మేపారగం
    భీరప్రక్రియగౌడపాద యతిరా డ్వేదండుఁడు ద్యద్రద
    స్పారశ్వేతరుచిప్రకాశముల నాశల్వేల్గఁబల్కెంగృపన్.

మ. కుతుకంబొప్ప మదిండలం తెయనఘా! గోపిందతీర్దోప దే
     శితవిద్యం బరతత్త్వ మేమరవుగా సేవించునే శిష్య సం
     తతితత్త్వ గ్రహణేచ్చ నిత్యరిపులం దండింతువేశాంతి దాం
     తితితీక్షాదిగుణంబులందగుదె సాధింతేసదా యోగమున్.

వ. అని యయ్యద్వైతాచార్యవర్యుండు ప్రేమానుబంధపూర్వకముగా నడుగుటయు శంకరయతీంద్రుడు భక్త్యుద్రేకమున గనుల నానందబాష్పంబులు గ్రమ్మ శిరంబున నంజలిపట్టి యల్లన నిట్లనియె.

ఆర్యా! మీరడిగినట్టి దంతయు నేల సిద్ధింపకుండెడిని? కారుణ్యాబ్ధియగు మీ కటాక్షపాత్రుండగు జంతువునకు దుర్లభం బేమియున్నది? భవదపాంగాలోకన ప్రసారమాత్రంబుననే మూగ వక్తయగుంగదా. మందుండు పండితుడగును. పాపాచారమతుండు సుకృతులలో గణింపబడును. కామాసక్తుడు నిస్పృహులలోఁ గీర్తి మంతుడగును. ఆహా ! సీమాతీతమగు భవన్మాహాత్మ్య లేక మగ్గింప నెవ్వనికిని శక్యంబగును ? జాతమాత్రంబుననే విరక్తినొందిన శుకమహర్షికి బ్రియశిష్యుండవైన మహాను భావుండవు. జ్ఞానపాధోనిధివి. ఇట్టి నీపాదద్వంద్వము మదీయ నేత్రగోచరమయినది. మామకభాగథేయ మమేయమైనదని వక్కాణింపనేల? యని యనేక ప్రకారంబుల