పుట:కాశీమజిలీకథలు-05.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

113

గాయకులు — ప్రపంచకమే యసత్యమైయుండ మా మాటలు సత్యములని మిమ్మెట్లు నమ్మింతుము? సత్య మసత్యము, అసత్యము సత్యము నెన్నఁడును కానేరదు గదా.

మంత్రులు — ఓహో మీరు గాయకులమని మోసపుచ్చి లోపలకు వచ్చి మా రాజుగారి ప్రాణములు గ్రోలితిరే.

గాయకులు — అయ్యో! మేమేమి చేసితిమి. దూరముగా నుండియే పాడితిమి. గానాంతరమున విమర్శింప నవసరము గలుగదయ్యె. మాయపరాధ మేమియున్నదియో యంతఃపురకాంత నడిగి తెలిసికొనుఁడు.

మంత్రులు — అంతయు నెరుంగుదుము. ఎవ్వరిని నడుగనక్కరలేదు. కానిండు, మీ యపరాధము ముందు విమర్శింతుము. మా యానతిలేక యెందునుం బోవలదు.

అని పలికి వారిం గాంచియుండఁ గొందరఁ గింకరుల నియమించి యా మంత్రులు రాజభార్యలనెల్ల నూరడింపుచు నా నృపతికి శాస్త్రగతి నపరసంస్కారాదికృత్యంబులు నిర్వర్తించి సమంచితమగు ముహూర్తంబునఁ దత్పుత్త్రులం బట్టాభిషిక్తుం గావించిరి. ఇంతలోఁ బూర్వ మమాత్యప్రేషితులగు భృత్యులు కొందరు వచ్చి మంత్రులతో నిట్లనిరి. అయ్యా మేము మీయానతి నరిగి యరణ్యములు, కొండలు, గుహలు లోనగు రహస్యస్థలంబులెల్ల నరసితిమి. నరసింహశైలంబున మాత్ర మొండువింత గంటిమి చిత్తగింపుడు. అత్యున్నతంబగు తదీయశిఖరం బెక్కి నలమూలలు వెదకితిమి. ఒక గుహాముఖంబునఁ గొందరు బోడిబాపనయ్యలు జేగురగుడ్డలు కట్టికొని నివసించియుండిరి.

వారిం జూచి మీరిందేల యుంటిరి? ఈ గుహ విమర్శింపవలయు లోపలికిఁ బోవలె నడ్డము లెండని పలికిన విని మఱేమియు నుత్తర మియ్యక వారు లోనికి బోవలదని సంజ్ఞ జేసిరి. వారి మాటలు పాటింపక మేము ద్రోసికొని లోనికిం బోయితిమి. అందొక పాషాణముమీఁద జేగురువస్త్రము ముసుంగిడుకుని యొకఁడు శయనించి యుండెను. వాని ప్రాయం బిరువదియేండ్లకు లోపుగానున్నది ఆయనను జూచి మేము లెమ్ము లెమ్ము నీ విం దేమిటికిఁ బరుండితివని యెంత బిగ్గరగా నరచినను లేవక మాటాడక యట్లే పడియుండెను.

అప్పుడది శవమని తలంచి మేము మీ యానతి చొప్పున దానిని దహింప యత్నింపుచుండ నందున్న బాపనయ్యలు మాతోఁ గలహించి యతండు తమ గురువనియు ముట్టగూడదనియు యోగనిద్రఁ జెందియున్నవాఁడనియుఁ బెద్దతడపు చతురు