పుట:కాశీఖండము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 69

లంబునందును గసుగందకుండుం గావున నవ్వేసవి గాశీక్షేత్రంబునందు నుపరతి చూపదు. ఏమును నిమ్మహోపద్రవంబునకుం బ్రశాంతిఁ గోరి యబ్రహ్మణ్యంబు సేయుచు బ్రహ్మశరణు సొచ్చితిమి. అవ్విరించి కరుణాకటాక్షంబున నీక్షించి యీయాపద యపనయింప వాతాపిహారితాపసుండు దక్కం దక్కినవాఁడు సమర్థుండుగాఁడు. అతనిం బ్రార్థింపుఁడు, పొం డని తాన నీకందువ చెప్పిన నీయానందవనంబున కనుదెంచితిమి. ఇకమీఁదఁ గోపాటోపావకుంఠకంఠకఠినహుంకారధారావష్టంభంబునం త్రివిష్టపరాజ్యలక్ష్మీమదాంధుం డైననహుషుని నిమిషమాత్రంబున ధాత్రీమండలంబునం బడఁద్రోచిన మహానుభావుండవు. నీవ ప్రమాణంబు. 98

క. ఎవ్వఁడు నిసర్గకఠినుం
డెవ్వఁడు సన్మార్గరోధి యీర్ష్యాపరుఁ డై
యెవ్వఁడు దన కధికునితోఁ
జివ్వకుఁ జేసాఁడు వానిసిరు లధ్రువముల్. 99

వ. అనిన వాచస్పతిపలుకు లాకర్ణించి యమ్మునిపుంగవుం డిట్లనియె. 100

తే. యత్న మొనరింతు నీకార్య మనువుపడఁగఁ
జనుఁడు మీమీనివాసదేశముల కర్థి
నున్నవాఁడు గదా! వీఁడే యుమయుఁ దాను
గాశికాభర్త మనపాలికల్పతరువు. 101

వ. అనిన వారును మహాప్రసాదం బని సముచితప్రకారంబునం గుంభసంభవుని వీడ్కొని నిజనివాసంబులకుం జనిరి. అనంతరంబ యగస్త్యుండు లోపాముద్రం జూచి యిట్లనియె. 102