పుట:కాశీఖండము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 శ్రీకాశీఖండము

వ. వీరెమునులు. వీరే సిద్ధసాధ్యమరుత్కిన్నరకింపురుషగంధర్వవిద్యాధరు లగుదేవయోనులు. మావచ్చినకార్యం బవధరింపుము. వింధ్యం బనుమహీధరంబు విబుధశైలంబుతోఁ బ్రతిస్పర్ధించి యూర్ధ్వాండకర్పరంబు నిజశిరశ్శృంగశృంగాటకంబుల నుద్ఘాటించుచు ననూరుసారధిపథం బవరోధించి నక్షత్రగ్రహతారచక్రంబుఁ జిక్కుపఱచి సప్తసమీరణస్కంధంబులనుం బ్రతిబంధించి శింశుమారాకారంబునం దారకావీథి బవ్వడించిన పాంచజన్యధరు నొరసి యౌత్తానపాది నుత్తరించి గగనగంగ నాలింగనంబుచేసి యురులింగాకారుఁ డైనధూర్జటిం ద్రివిక్రమాకారంబున విరాడ్రూపుం డగు విష్వక్సేను ననుకరించియున్నయది. తృటినిమేషకాష్టాకళాముహూర్తాహోరాత్రపక్షమాసర్త్వయన సంవత్సరయుగసంధ్యాసంధ్యాంశమన్వంతరకల్ మహాకల్పాదిభేదభిన్నం బై పదార్థంబులం బరిచ్ఛేదించుకాలంబు నినస్తసమస్తోపాధికస్వప్రతిష్ణాఖండసచ్చిదానందైకరసాద్వితీయరూపుం డైనవిరూపాక్షుండు దప్పించి యన్యులనుం బరిచ్ఛేదించు. అట్టికాలంబునకుం దపనపరిస్పందంబు మూలంబు. మార్తాండుండు కొండప్రక్కం జిక్కి కడలిమొగయక్కలిం దగులుపడి చిక్కిన జోగునుంబోలె నెదురు నడవ మరలం బఱవలేక చీకాకుపడియున్నవాఁడు. ప్రాహ్ణాపరాహ్ణమధ్యాహ్నసమయంబులు గత్తరఁ గలయుటం జేసి నిత్యనైమిత్తికాదిక్రియాకలాపంబు లుపసంహృతంబు లయ్యె. ప్రాచ్యోదీచ్యదేశంబు లంధకారాతపహిమానిలంబులచేతం జేతనావైకల్యంబు వహించె. భువనంబుల కకాండప్రళయం బావిర్భవించె. కల్పాంతకా