పుట:కాశీఖండము.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

485


మందిరంబు ప్రవేశించె. సురభిగంధంబులై గంధవాహంబులు వొలసె. గంధర్వులు దివ్యగాంధర్వంబున మద్రకాది(మహా)ప్రబంధంబులు పాడిరి. అప్సరస లాడిరి. మహర్షులు హర్షించిరి. చారణులు సం స్తుతించిరి. ప్రమథులు ప్రమోదించిరి. విద్యాధరులు పుష్పవర్షంబులు గురియించిరి. చరాచరభూతజాలంబు సంప్రీతిమేదురంబు లయ్యె. పంచమహావాద్యంబులు సెలంగె. ఇబ్బంగి గృహప్రవేశమహోత్సవారంభంబు త్రిభువనచరదృక్కరంభం బయ్యె. నయ్యవసరంబున.

221


ఉ.

వెగ్గల మైనవాసనలు విశ్వజగంబులఁ గ్రమ్మ వేల్వఁగా
గుగ్గులుధూపధూమము లగోచరలీల నజాండగోళము
స్మగ్గఱఁ బాఱె వానిమిళనంబునఁ గాదె నభంబు గల్వపూ
[1]మొగ్గయుఁబోలి యిప్పుడు సమున్నతి నీలిమ మయ్యెఁ జూడ్కికిన్.

222


తే.

అవసరం బిచ్చి శివుఁడు బ్రహ్మాచ్యుతాది
దేవతల గారవించె నతిప్రియమున
నటు విశేషించి మధుకైటభాసురారి
నాదరించెను గారవం బతిశయిల్ల.

223


వ.

ఆదరించి యిట్లని యానతిచ్చె.

224


తే.

నీకతనంబునఁ గాదె నాళీకనయన?
కలిగెఁ గ్రమ్మఱ నానందకాననంబు
తక్కొరుఁడు నేర్చునే దివోదాసనృపతి
విబుధసందోహవిద్వేషి వెడల నడువ?

225


వ.

నీకుం బ్రియం బెయ్యది? యదియ వరంబుగా నిత్తు ననిన నచ్యుతుం డంబికావల్లభున కి ట్లనియె.

226
  1. మగ్గయుఁబోలె నిప్పుడు సమంచిత' ఇయ్యది విచార్యము.