పుట:కాశీఖండము.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

438

శ్రీకాశీఖండము


నాతప్పు గాక యిది తా
నీతనితప్పెట్లు? నాకు నిది కావలయున్.

49


తే.

పేద లయ్యును గడు బిఱ్ఱబిగిసి యుండ్రు
వట్టియభిమానములును గర్వములుఁ బట్టి
యల్లువారికి నెల్ల నీయవగుణంబు
వెన్నతోఁ బెట్టినది యింత విసువ నేల?

50


తే.

అహహ! [1]యలచంద్రుఁ డనువాఁ డహంకరించి
రోహిణీదేవి నొల్లక రోసి యుండెఁ
బాపి నతని క్షయవ్యాధిబాధితుఁడుగఁ
గినిసి శపియింపనే? కల్ల వినఁగ నోర్వ.

51


క.

ఇది ధర్మం బకులీనుల
కిది విధి మాతాపితృప్రహీనుల కహహా!
యిది కట్టడి తిరిపెములకు
నెదిరిం దను నెఱుఁగ కునికి యేలా మాటల్?

52


శా.

తా నెట్లేనిఁ దిరస్కరించె నను నాస్థానంబునం దేవతా
మౌనివ్రాతములోన మామ యనుసన్మానంబు శూన్యంబుగా
నేనుం దన్నుఁ దిరస్కరించెద మఘం బిప్పాటఁ గల్పించి సం
స్థానీయత్వముఁ బూని యల్లుఁడను సన్మానంబు శూన్యంబుగన్.

53


వ.

అని యజ్ఞసంభారంబు లొడంగూర్చి యజ్ఞపురుషుం డైనపురుషోత్తముం డుపద్రష్టగా, బ్రహ్మవాదు లగుమరీచ్యత్రిభరద్వాజాదిసప్తర్షులు ఋత్విజులుగాఁ, ద్రైలోక్యంబును దక్షిణాద్రవ్యంబుగా, భృగుండు బ్రహ్మగా, నాంగిరసుం డాచార్యుం

  1. 'మును చంద్రుఁ; యిలచంద్రుఁ .. రోహిణీదేవి నొకకొంత రోసి' అని వ్రాఁతపుస్తకము.