పుట:కాశీఖండము.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

437


దేశంబు గుఱుతు సాధింపంగ వచ్చునే?
        వర్తనం బెఱుఁగంగ వచ్చు నెట్లు?
వృషభవాహనుఁ డఁట విషముఁ దిన్నాఁడఁట!
        యితనిసమాచార మేమి చెప్ప!
యస్త్రంబు ధరియిచు నఁట తపస్వియు నట్టె!
        యిట్టివేడబము లెయ్యెడలఁ గలవె?


తే.

కాటిలో నుండు గార్హస్థ్యగణన యెట్లు?
బ్రహ్మచారియు గృహియు నెబ్భంగి నయ్యె!
శూద్రుఁడో! బ్రాహ్మణుండొ! వైశ్యుండొ! రాజొ!
తెలియవచ్చునె యీతని కల తెఱంగు?

46


వ.

అర్ధనారి గావునం బురుషుండు గాఁడు; గడ్డంబు గలదు గావున యోష గాదు; సమర్చనీయలింగమూర్తి గావున నపుంసకుండు కాఁడు; పెద్దకాలంబువాఁడు గావున బాలుండు గాఁడు; చిరంతనుండు గావునఁ దరుణుండు కాఁడు; జరామరణవర్జితుండు గావున వృద్ధుండు గాఁడు; మహాకల్పాంతంబునం బ్రహ్మాదుల వధియించియుఁ బాతకి కాఁడు; ఈతనిచందం బెవ్వం డెఱుంగు. నది య ట్లుండె.

47


క.

మామ గురుస్థానంబు న
సామాన్యుఁడ నెట్లు? జలజసంభవసుతుఁడన్
సౌముఖ్యంబున యోగ
క్షేమం బారసి ప్రియంబు చెప్పఁగవలదే!

48


క.

మాతాపితృవర్జితుఁ డగు
[1]నీతని కే నెట్లు బిడ్డ నిచ్చితి? నవియున్

  1. ‘నీతనికిని నెట్లు బిడ్డ నిచ్చితి (నదియున్) నాదిన్’ అచ్చుపుస్తకము.