పుట:కాశీఖండము.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకాశీఖండము

420


వైపు దప్పిన మహాకోపంబుతోడన
        పోయె వైరం బాత్మఁ బూని డాయ
కొండుచోటికిఁ బోవు టుచితంబు మన మిఁక
        వానికిన్కకు నోర్చువార మెట్లు?


తే.

చిచ్చువాతను బరువాతఁ జిక్కువడక
తప్పిపోయిన వారెపో తజ్ జ్ఞు లెందు
దాఁతకట్టిన చెఱు వంచుఁ దగునె మునుఁగ?
[1]నిల్లు విడువంగ లేక చా నేల మనకు.

294


చ.

అన విని పారువం బడరి యౌవనగర్వమునం బడంతికి
ట్లను నిది యేమి? నాబలపరాక్రమసంపద యింతమాత్రమే?
తనసరివారికి న్వెఱచి ధామముఁ బాడఱఁ జేసి దాఁగఁ బో
యిస సరియిండ్లవారు నగరే? ఖగమో యదియేమి దయ్యమో?

295


తే.

అది విహంగమ మేను విహంగమంబ
పెసరగింజకుఁ దక్కువే పెసరగింజ?
యబల! యిటు చూడు మప్పక్షియదటు మాంతుఁ
గుటిలచంచూపుటీకోటికుట్టనముల.

296


వ.

అనిన 'ధర్మో జయతి' యనుచుం బారావతి యూరకుండ నంత మఱునాడు ఱేపకడ నాశ్యేనంబు ద్రివిష్టపేశ్వరునగరీప్రాకారంబుమీఁద నిర్గమద్వారంబు నిరోధించి పొంచి యుండి సంచారార్థంబు దిక్కులకు వెడలునక్కలరవంబుల నుక్కుఁ దండసంబువోనిముక్కున నంకుశంబులం బోలు చరణనఖాంకురంబులం బెట్టనుం బోతునుం గఱచియు నూఁదియు నొక యేకాంతప్రదేశంబునం భక్షించునది యై

  1. ‘ఇల్లు వెడలక చావంగ నేల మనకు?’ అని పాఠాంతరము.