పుట:కాశీఖండము.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

415


తే.

దక్షిణమున త్రివిష్టపస్థానమునకుఁ
జెంగట సరస్వతీశ్వరక్షేత్ర మనఘ!
యిచ్చుఁ గొలిచినవారి కయ్యిందుధరుఁడు
గరుణ సారస్వతం బైనపరమపదము.

274


క.

యమునేశ్వరుఁడు ద్రివిష్టకు
సమీపమున నంబుపతిదెస న్వసియించున్
యమపుటభేదననికట
ద్రిమవాటికఁ జూడ రవ్విధుధరునిభక్తుల్.

275


తే.

ఆత్రిలోచనుప్రాగ్దిక్కునందు నుండు
నర్మదేశుండు నిజభక్తశర్మదాయి
శైవదీక్షావిధిజ్ఞ! తత్సేవకులకు
మాతృగర్భార్భకత్వంబు [1]మందు సుమ్ము.

276


తే.

అఖిలనీవారముష్టింపచాగ్రగణ్య!
ప్రత్యహంబు ద్రవిష్టపద్రష్ట యెవ్వఁ?
డవ్విశిష్టుఁడు విష్టపాధ్యంతరమున
వీసమంతటిమాత్రంబు వెలితిస్రష్ట.

277


ఉత్సాహ.

లీల మనుజుఁ డెవ్వఁ డేఁ బిలిప్పిలాతరంగిణిం
దేలి శ్రీత్రివిష్టపేశు ద్రిపురమథను శశికళా
మౌళిఁ బూజ సేయుఁ గుసుమమాల్యముల నతండు డా
కాలిమడమఁ జప్పళించుఁ గాలమృత్యువక్త్రమున్.

278
  1. అచ్చుపుస్తకమున 'మందు కొడుకు' అనియు, వ్రాఁతపుస్తకమున 'మందు కుడుక' యనియు, మఱియొక వ్రాఁతపుస్తకమున 'మందు సుమ్ము' అనియున్నది. దీనికి “దృష్టం త్రిలోచనా త్ప్రాచ్యాం నర్మదేశం సుశర్మదం, తల్లింగార్చనతో నౄణాం గర్భవాసో నిషిధ్యతే" అని సంస్కృతమూలము.