పుట:కాశీఖండము.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

శ్రీకాశీఖండము


మానిని.

ఉత్తరవాహినియై ప్రవహించుచునున్న పిలిప్పిలఁ గ్రుంకి మదిం
దత్తపా టొకయించుక లేక యథావిధిఁ గోమలతాకకరా
డ్భిత్తకిరీటుఁ ద్రివిష్టపనాయకుఁ [1]బెన్మసనంబునఁ గొల్చిన భా
గ్యోత్తరుఁ గాంచి నమస్కృతి సేయుదు రుప్పరవీథిఁ జరించుసురల్.

279


తే.

ఇతరదేశంబులం దుపార్జితము లైన
పాపములు వాయుఁ గాశికాపట్టణమున
గాశిఁ జేసినపాప మెక్కడను బాయ
దదియుఁ బాయుఁ ద్రివిష్టపోపాంతభూమి.

280


తే.

కాశి జంబూతరుద్వీపకనకభూష
కాశియం దుత్తమంబులు క్రమవిభూతి
సింధుసంభేద మోంకారశివపదంబు
శ్రీత్రివిష్టపనాయకక్షేత్రతలము.

281


క.

విదితముగఁ గాశినడుమం
ద్రిదశమణికిరీటకోటిదీధితివిలస
త్పదునిఁ ద్రివిష్టపుఁ గొలిచిన
నొదవును సిరిమోక్షపదము [2]నుదయవివేకా!

282


శా.

కుంభసంభవ! యాత్రివిష్టపుని గ్లౌకోటీరు సింధుత్రయీ
సంభేదస్థలవాసుఁ గొల్చునరునిన్ సాధింపఁగాఁ జాలునే
కుంభీపాకముఖప్రధాననరకక్రూరప్రకారవ్యథా
సంభారంబుల నీగఁ జాలు మదిరాస్వాదాదిపాపౌఘముల్.

283
  1. ‘బ్రేమమనంబునఁ’ అని వ్రాఁతపుస్తకము. ‘బెన్నసమంబుగఁ’ అని అచ్చుపుస్తకము.
  2. ‘నొదవును శివమోక్షపదము లుదితవివేకా!’ అని పాఠాంతరము.